Friday, May 3, 2024
- Advertisement -

భారత రత్న అవార్డును అందుకున్న మాజా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ…

- Advertisement -

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2019 ఏడాదికి గాను దేశ అత్యున్నత పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును అందుకున్నారు.

ఆయనతో పాటు దివంగత , దర్శక నిర్మాత, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్‌ హజారికాకు, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు దివంగత నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారతరత్నను ప్రధానం చేశారు. రిలో భూపేన్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌కు మరణానంతరం భారతరత్న వరించింది.

భూపేన్‌ హజారికా తరఫున ఆయన తనయుడు తేజ్‌ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌ తరఫున ఆయన కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న అనంతరం ప్రణబ్‌ ముఖర్జీకి పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -