Friday, May 3, 2024
- Advertisement -

ఉత్త‌ర‌కొరియాపై చ‌ర్య‌లు తీసుకొనేందుకు వెన‌కాడ‌బోమ‌న్న జీ-7దేశాల కూట‌మి

- Advertisement -
G7 warns to North Korea

ఉత్త‌ర కొరియా…అమెరికా మ‌ధ్య ఇప్ప‌టికే ప‌చ్చ‌గ‌డ్డివేస్తే బ‌గ్గుమంటుంది.అమెరికాను ఏమాత్రం లెక్క‌చేయ‌కుండా క‌య్యానికి కాలు దువ్వుతోంది.ఇరు దేశామ మ‌ధ్య ఇప్ప‌టికే మాటల స్థాయి త‌గ్గి చేతుల్లో చూపించేందుకు సిద్ద‌మ‌య్యారు.

అమెరికాతోపాటు అగ్ర‌దేశాల హెచ్చ‌రిక‌ల‌ను ఏమాత్రం ఖాత‌రు చేయ‌కుండా అణుప‌రీక్ష‌ల‌ను జ‌రుపుతున్నా ముందుకు వెల్తోన్న ఉత్త‌ర‌కొరియాకు జీ-7దేశాలు ముక్కుతాడు వేయ‌నున్నాయి.
ఇప్పటికే ఉత్తర కొరియా, అమెరికా మధ్య ఉద్రిక్తపూరిత పరిస్థితులు ఉన్న నేప‌థ్యంలో .. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు ఇప్పటికే ఉత్తర కొరియా సముద్ర జలాలకు సమీపంలో మోహరించి ఉంచారు.ఎప్పుడు ఏంజ‌రుగుతుందో అంత‌ర్జాతీయంగా ఆందోళ‌న నెల‌కొంది.అయితే దుందుడుకు చ‌ర్య‌ల‌పై జీ-7 దేశాలు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

ఉత్తరకొరియా తాజాగా చేపట్టిన క్షిపణి పరీక్షలపై జీ–7 దేశాధినేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాలు ప్రపంచ భద్రతకు ప్రమాదంగా మారాయని.. ఉత్తరకొరియాపై తీవ్రమైన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ఇటలీలోని తోర్‌మినాలో జరుగుతున్న జీ–7 దేశాల సదస్సు ముగింపు సందర్భంగా ‘భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా అన్ని అణు, బాలిస్టిక్‌ క్షిపణులను వదులుకోవాలి. ఉత్తరకొరియాలో మానవహక్కులను పరిష్కరించాలి’ అని ఓ ప్రకటనలో ఆదేశించారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}2i8cUJ_mV34{/youtube}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -