Sunday, May 5, 2024
- Advertisement -

మ‌హిళ‌ల చేతికి ఆయుధంగా యాంటీ రెడ్ ఐ

- Advertisement -

స్పై కెమెరాలు అవి ఎక్క‌డ ఉంటాయో మ‌నం గుర్తించ‌లేం.. వీటి బారిన ప‌డిన మహిళలు మాత్రం తీవ్ర అమవ‌మానాలు ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. బెడ్రూంలో లైట్ కింద‌.. పెన్నులో, బాత్రూమ్‌లో బ్ర‌ష్‌లో, న‌ల్లా పైపున‌కు ఇలా ఎక్క‌డెక్క‌డో చిన్న ప‌రిమాణంలో ఉండే స్పై కెమెరాలు నిక్షిప్తం చేసి న‌గ్న వీడియోలు రూపొందించి మ‌హిళ‌ల‌ను వేధించే ఘ‌ట‌న‌లు చాలా జ‌రుగుతున్నాయి. కొంద‌రు ప‌రువు పోతుంద‌ని మిన్న‌కుంటారు.. కొంద‌రేమో వారితో కాంప్రమైజ్ చేసుకోవ‌డానికి వారు అడిగిన వాటిని ఇచ్చేస్తుంటారు. ఇక ఇలాంటి ప‌రిస్థితుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికి మంచి అవ‌కాశం వ‌చ్చింది. మ‌హిళ‌ల చేతికి ఆయుధం లాంటిది వ‌చ్చేసింది. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు అలాంటి వారిప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంది. అదే రెడ్ ఐ.

స్పై కెమెరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సినీ నటిమ‌ణిలు సమంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ‌రీన్ కోరుతున్నారు. ప్రతి ఒక్కరిలో అవ‌గాహ‌న తీసుకురావాలనే ఉద్దేశంతోనే యాంటీ రెడ్ ఐ పేరుతో మిస్డ్‌కాల్ (80992 59925) ప్ర‌చారం చేప‌డుతున్నారు. ఈ ర‌హాస్య కెమెరాలు ఆన్ లైన్‌లో రూ. 250 కే లభిస్తూ వీటిని సొంతం చేసుకుని మ‌హిళ‌లు వేధించే వారు ఎక్కువ‌వ‌డంతో ఈ విధంగా చ‌ర్య‌లు తీసుకుంటోంది తెలంగాణ ప్ర‌భుత్వం, ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తో క‌లిసి చ‌ర్య‌లు చేప‌డుతోంది.

టూత్ బ్రష్, షాంపు బాటిల్స్ లోనూ సులువుగా స్పై కెమెరాలు పెట్టేసి స్పై కెమెరాలను దుర్వినియోగం చేస్తూ మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారని గుర్తిస్తూ ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఈ ప్ర‌చారానికి హీరోయిన్లు కాజల్, సమంత, మెహ్రీన్ మ‌ద్ద‌తు నిలుస్తూ ప్ర‌చారం చేస్తున్నారు. మహిళలపై స్పై కెమెరాలతో.. సీక్రెట్‌గా షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత బెదిరింపులు పెరుగుతున్నాయని, దీన్ని అరికట్టేందుకు ఈ అవ‌గాహ‌న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎవరైనా ఇలాంటి ఘటనల బారిన పడే మహిళలు 80 9925 9925 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -