Thursday, April 25, 2024
- Advertisement -

మళ్లీ తగ్గుముఖం పట్టిన పసిడి!

- Advertisement -

గత ఏడాది నుండి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది. కానీ అనూహ్యంగా బంగారం రేటు మాత్రం చుక్కలనంటింది. గత ఏడాది నుంచి బంగారం దాదాపు రూ.60 వేల వరకు వెళ్లిందంటే ఆశ్చర్యం లేదు. కానీ ఈ మద్య మాత్రం తగ్గు ముఖం పట్టిందని అంటున్నారు. బంగారం ధరలు శనివారం తగ్గుదల కనబరిచాయి. దీంతో సోమవారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగివచ్చాయి. సోమవారం ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. 22 క్యారెట్ బంగారం రూ.45,480 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 49 వేలరూపాయల మార్క్ వద్దకు దిగొచ్చింది.

అయితే బంగారం కంటే వెండి పై పైకి దూసుకు పోతుంది.  కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరకంటె ఏకంగా 500 రూపాయలు ఎగసింది. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 70,000 రూపాయల వద్దకు చేరుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -