Wednesday, April 17, 2024
- Advertisement -

అలెక్సీ నావెల్నీని విడుదల చేయాలంటూ ఆందోళన.. వందల మంది అరెస్ట్..!

- Advertisement -

రష్యాలోని ప్రధాన నగరాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావెల్నీని జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. తీవ్రమైన​ చలిని కూడా లెక్క చేయకుండా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన చేశారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు.

నావెల్నీ మద్దతుదారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొన్ని చోట్ల వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో మాస్కో, సెర్బియా, నోవోసిబిర్సిక్​, యెకాటెరిన్బర్గ్​, యుజ్నో-సఖాలిన్​స్క్ సహా పలు​ నగరాల్లో 850మంది నిరసనకారుల్ని అరెస్టు చేశారు పోలీసులు.

2014లో ఆర్థిక దుశ్చర్యలను ప్రేరేపించారన్న కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు నావెల్నీ. గతేడాది విషప్రయోగానికి గురై జర్మనీలో చికిత్స పొంది.. ఇటీవల స్వదేశానికి వచ్చిన నావెల్నీని ఈ నెల 17న పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -