Monday, May 6, 2024
- Advertisement -

మీ త్యాగం మరువం

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోంది. అమరులైన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ణయించారు.

తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు వారికి నియామక పత్రాలకు అందజేస్తారు. తెలంగాణలోని పది జిల్లాల్లోనూ 588 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు. జూన్ 2 న రాష్ట్ర అవతరణ సందర్భంగా వివిధ జిల్లాల్లో మంత్రులు అమరులైన వారి కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు.

ఈ ఉద్యోగాలు పొందుతున్న వారిలో అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి 186 మంది ఉన్నారు. రెండో స్ధానంలో వరంగల్ ఉంది. ఇక్కడి నుంచి 118 మందికి ఉద్యోగాలు లభస్తున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -