తెలంగాణలో జరిగిన ఎన్నికలలో తిరిగి అధికారంలో వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టలేదు. తాజాగా ఈ రోజు ఉదయం 10 మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు సీఎం కేసీఆర్. టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లకు మంత్రులగా అవకాశం దక్కింది.
అయితే తొలి మంత్రిదవర్గ విస్తరణలో కేటీఆర్, హరీష్ రావులకు చోట దక్కకపోవడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావును కావాలనే పక్కన పెట్టారని కొందరు అనుకుంటున్నారు. తాజాగా ఆ వార్తలపై స్పందించారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికి ముందుగా నా శుభాకాంక్షలు. నాకు మంత్రి పదవి రాలేదని బాధ ఏం లేదని , సీఎం కేసీఆర్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని తెలిపారు. మంత్రి ఇవ్వలేదని ఎటువంటి అసంతృప్తి లేదు, ప్రజలు అంతకుమించినదే ఇచ్చారని చెప్పుకొచ్చారు.
- Advertisement -
మంత్రి వర్గ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
