Monday, May 6, 2024
- Advertisement -

తమిళనాట రూ.450 కోట్ల నల్ల డబ్బు పట్టివేత..!

- Advertisement -

తమిళనాడు చెన్నైలో ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో… ఐటీ సెజ్​ మాజీ డైరెక్టర్​, స్టెయిన్​లెస్​ స్టీల్ సరఫరాదారు కార్యాలయంలో రూ.450 కోట్లు నల్లధనం గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. నవంబరు 27న చెన్నై సహా ముంబయి, హైదారాబాద్​, కడలూరులో ఈ సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది.

గడిచిన మూడేళ్లుగా ఐటీ సెజ్​ మాజీ డైరెక్టర్​, ఆయన కుటుంబ సభ్యులు కలిసి పలు అక్రమ మార్గాల ద్వారా రూ. 100 కోట్లు సంపాదించినట్లు అధికారులు వెల్లడించారు. బోగస్​ ప్రాజెక్టులు/ఫీజులు ద్వారా మరో రూ.190కోట్లు అక్రమ సంపద సృష్టించినట్లు పేర్కొన్నారు.చెన్నైకు చెందిన స్టెయిన్​లెస్​ స్టీల్​ సరఫరా సంస్థ​… లెక్కలోకి వచ్చేవి, రానివి, పాక్షికంగా లెక్కలోకి వచ్చేవి వంటి మూడు రకాల అమ్మకాలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.

లెక్కలోకి రానివి, పాక్షికంగా లెక్కలోకి వచ్చే అమ్మకాల ద్వారా ఏడాదికి 25 శాతం కంటే ఎక్కువ ఆదాయాన్ని అక్రమంగా సంపాదించగా.. కేవలం లెక్కలోకి రాని విక్రయం ద్వారానే రూ.100 కోట్లు సంపాదించినట్లు అంచనా వేశారు. ఇతర లావాదేవీల ద్వారా మరో రూ.50 కోట్లు అక్రమంగా సంపాందించినట్లు తేల్చారు.

మహమ్మారి జననం భారత్ లోనే : డ్రాగన్

వేడెక్కిన రాజకీయాలు.. రజనీ ఎంట్రీ..?

అమెరికాలో ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి..!

మొదటి లవ్​ జిహాద్ కేసు నమోదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -