Sunday, May 5, 2024
- Advertisement -

ఆసియాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్ మ‌న‌దే..!

- Advertisement -

హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఆసియాలోనే అతిపెద్దది మెట్రోగా మ‌న హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్ రికార్డు సృష్టించింది. ఎల్బీనగర్‌–మియాపూర్‌(కారిడార్‌–1)మార్గంతోపాటు కారిడార్‌–2(జేబీఎస్‌–ఫలక్‌నుమా)మార్గాన్ని సైతం అనుసంధానించేలా నాలుగు అంతస్తుల భారీ స్టేషన్‌ను ఇక్కడ నిర్మించడం ఇంజినీరింగ్‌ అద్భుతమని హెచ్‌ఎంఆర్‌ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌రూట్లో మెట్రో రాకపోకలు ప్రారంభం అయ్యాయి.ఎల్బీనగర్‌–అమీర్‌పేట్ రూట్లో మెట్రోను గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహాన్ ప్రారంభించారు.

గ‌వ‌ర్న‌ర్ వెంట మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.ఎల్బీనగర్‌–అమీర్‌పేట్ రూట్లో మొత్తం 17 స్టాప్‌లు ఉన్నాయి. ఈ మార్గంలో ప్రధానంగా నాంపల్లి, ఎంజేమార్కెట్, జాంభాగ్, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్, రంగమహల్‌ ప్రాంతాలున్నాయన్నారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజ్, రంగమహల్‌ ప్రాంతాల్లో అత్యధిక ఎత్తులో ఉన్న పిల్లర్లతో నిర్మిచినట్లు తెలిపారు. ఈ పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం ఎన్నో ఇంజినీరింగ్‌ అద్భుతాలకు శ్రీకారం చుట్టిందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -