Friday, May 17, 2024
- Advertisement -

డాంభికాలు ప‌లికే బాబుకు అంద‌ని ఆహ్వానం

- Advertisement -
  • హైద‌బాబాద్‌లో ప్ర‌పంచ పారిశ్రామిక‌వేత్త‌ల స‌ద‌స్సు
  • ప్ర‌పంచ ప్ర‌తినిధిగా బిల్డ‌ప్ ఇచ్చుకునే పిలుపేది
  • పిలుపు కోసం చంద్ర‌బాబు ఎదురుచూపులుమాట్లాడితే ప్ర‌పంచమంతా నాకు తెలుసు. అన్నీ దేశాలు తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట ప‌ట్టిస్తాన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టిస్తుంటాడు. ప్ర‌పంచ‌మంతా కాళ్ల‌రిగేలా తిరిగి హైద‌రాబాద్‌ను తానే అభివృద్ధి చేశాన‌ని.. ఒబామా, జార్జ్ బుష్ త‌న‌కు తెలుసు.. ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధి తాన‌నే ప్ర‌క‌టించుకునే బాబుకు ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పి ప‌ట్టుకుంది. ప‌క్క రాష్ట్రంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌పంచ పారిశ్రామిక‌వేత్త‌ల స‌ద‌స్సు వారం రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. అయితే ఈ స‌ద‌స్సుకు చంద్ర‌బాబుకు ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఈ స‌ద‌స్సుకు దేశ‌, విదేశీ ప్ర‌ముఖులు రావ‌డానికి క్యూలు క‌డుతున్నారు. వారంద‌రికీ ఆహ్వానాలు అందుతున్నాయి. అయినా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న బాబుకు ఆహ్వానం అంద‌లేదు. ఇంత‌కు ఒక స‌ద‌స్సు జ‌రుగుతుంద‌నే విష‌యం కూడా తెలియ‌న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఈ స‌ద‌స్సులో భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ట్రంప్ కూతురు ఇవాంకా, ప్ర‌పంచ కుబేరులు, వ్యాపార‌స్తులు, చివ‌రికి సినీన‌టులు పాల్గొంటున్నారు. వారంద‌రికీ అందిన ఆహ్వానం చంద్ర‌బాబుకు అంద‌క‌పోవ‌డంపై ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది. మొద‌టి నుంచి చంద్ర‌బాబుకు విదేశీ మోజు ఉంది. ఏవేవో ప‌ర్య‌ట‌న‌లు అంటూ ప్ర‌త్యేక విమానాల్లో చ‌క్క‌ర్లు కొట్టి వ‌స్తారు. త‌ప్ప ఆ ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల రాష్ట్రానికి క‌లిగిన ప్ర‌యోజ‌న‌మేమి లేద‌ని అంద‌రికీ తెలిసిందే. పైగా ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధిగా అతడికి ఓ ముద్ర ఉంది. మ‌రీ అంత‌టి వ్య‌క్తికి ఈ స‌ద‌స్సుకు ఆహ్వానం ఎందుకు రాలేద‌ని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న ఏపీ అధికార పార్టీ ఆ స‌ద‌స్సును త‌మ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకునే అంశాన్ని ప‌రిశీలించ‌లేదు. తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు త‌మ రాష్ట్రంలో ప్ర‌ఖ్యాత స‌ద‌స్సులు అన్నీ నిర్వ‌హించాల‌ని కేంద్రాన్ని బ‌తిమాలాడో.. బుజ్జగించో.. ఏదో ఒక‌టి చేసి ప్ర‌పంచ స‌ద‌స్సులు హైద‌రాబాద్‌లో జ‌రిగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చివ‌రికి బీజేపీ స‌ద‌స్సులు కూడా తెలంగాణ‌లోనే ఎక్కువ జ‌రుగుతున్నాయి. కేంద్ర మంత్రుల ప‌ర్య‌ట‌న‌లు ఏపీలో క‌న్నా తెలంగాణ‌లో ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. కేంద్రం దృష్టిలో ఏపీ క‌న్నా తెలంగాణ మేలు అని ఉంది. ఇంత డాంభికాలు ప‌లికే బాబుకు ప్ర‌పంచ స‌ద‌స్సులో పాల్గొన‌క‌పోవ‌డం చూస్తుంటే బిల్డ‌ప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని తెలుస్తోంది. అయితే ఈ స‌ద‌స్సులో పాల్గొనే అవ‌కాశం కోసం చంద్ర‌బాబు అండ్ కో కేంద్ర మంత్రులు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌..

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -