Thursday, March 28, 2024
- Advertisement -

దేశంలో కరోనా కరాళ నృత్యం..ఒక్క రోజులో 4లక్షల కేసులు!

- Advertisement -

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది.. గత ఏడాదితో పోల్చితే కేసుల సంఖ్య మరింత ఘోరంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం నుంచి నిత్యం లక్షలాది కేసులు వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో గురువారం 3,86,452 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 3,498 మంది బాధితులు మరణించారు.

ప్రస్తుతం దేశంలో 31,70,228 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదే సమయంలో కరోనా నుంచి 2,97,540 మంది బాధితులు కోలుకున్నారు. మే 1 నుంచి భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది.

ఇక 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 66,159 కేసులు ఉండగా, కేరళ, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో 30 వేల నుంచి 40 వేల మధ్య రికార్డయ్యాయి. ఇక న్యూఢిల్లీలో 24,235 మందికి కరోనా వైరస్‌ సోకింది.

ఇజ్రాయిల్ పవిత్ర స్థలం వద్ద ఘోరం.. తొక్కిసలాటలో 44 మంది మృతి!

ఫిబ్రవరి వరకు అప్రమత్తంగా ఉండాలి : సీఎం వైఎస్ జగన్

మంచు విష్ణు కుటుంబంలో చిచ్చు.. ఐపీఎల్ వల్లే అంటూ ట్వీట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -