Thursday, April 18, 2024
- Advertisement -

ఫిబ్రవరి వరకు అప్రమత్తంగా ఉండాలి : సీఎం వైఎస్ జగన్

- Advertisement -

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 86,035 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోగా, 57 మంది మరణించారు. తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,158కి పెరిగింది. తాజాగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ కీలక, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశ జనాభా, రాష్ట్రాల అవసరాలు, వ్యాక్సిన్ ఉత్పత్తి గణాంకాలను బేరీజు వేసుకున్న నేపథ్యంలో 2022 ఫిబ్రవరి దాకా ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించి నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ తన అభిప్రాయం చెప్పారు. కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారం అని సీఎం జగన్ తేల్చి చెప్పారు.

అయితే వ్యాక్సినేషన్ సమస్య ఎప్పటికి తీరుతుందో తెలియడం లేదన్నారు. కాగా, 18 నుంచి 45 ఏళ్లు లోపు వయసు వారికి ఇప్పట్లో టీకా లేదన్న సీఎం జగన్, వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ అందిస్తామని అన్నారు. 2022 ఫిబ్రవరి వరకు అందరం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అప్పటి వరకు మనల్ని మనమే రక్షించుకోవాలి.. మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ ఉపయోగించుకోవాలి. వచ్చే ఏడాది (2022) జనవరి చివరి నాటికి వారందరికీ టీకా ఇవ్వగలుగుతామన్నారు. ఇదీ వాస్తవ పరిస్థితి అని సీఎం జగన్ చెప్పారు. ఏడాది దాదాపు ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ తేల్చి చెప్పేశారు.

స్టార్ డైరెక్టర్ కేవీ ఆనంద్ కన్నుమూత!

బాలయ్యతో సినిమాకు అనిల్ రావిపూడి ఎన్ని రూ. కోట్లు పెడుతున్నాడో తెలుసా?

కూకట్ పల్లిలో కాల్పుల నిందితుల అరెస్ట్.. ఆ తప్పుతోనే బుక్కయ్యారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -