Friday, May 3, 2024
- Advertisement -

భారత్ నుంచి పాక్ తప్పించుకోలేదు…పాక్ ను హెచ్చరించిన ఆర్మీ చీఫ్ రావత్

- Advertisement -

కశ్మీర్ లో జరుగుతున్న నరమేధానికి చివరి బుల్లెట్ వరకు పోరాడతామంటూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా వీరావేశంతో చేసిన వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఘాటుగా స్పందించారు.తమ సైన్యంపై పాక్ కు నమ్మకం లేకనే అణ్వాయుధాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి భారీ సంఖ్యలో బలగాలను మోహరిస్తోందన్నారు. కాశ్మీర్ లో ఏదైనా హింస చేయాలని చూస్తె భారత్ నుండి పాక్ తప్పించుకోలేదని హెచ్చరించారు.

పాక్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచివుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయని, అయితే ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉందని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఎల్ వోసీ దిశగా భారీగా దళాలను తరలిస్తోందని, ఈ పరిణామం పట్ల తాము అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు. ఉగ్రవాదులు రెచ్చిపోయేందుకు తమ దేశంలో ఉగ్రవాదులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. భారత్ లో ఏదైనా హింస చేయాలని చూస్తె భాకత్ నుంచి తప్పించుకోవడం పాక్ వల్ల కాదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -