Friday, April 26, 2024
- Advertisement -

నల్లధనం పత్రాలో అమితాబ్.. ఐశ్వర్య

- Advertisement -

పనామా పత్రాలు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరి నోట విన్నా వీటి గురించే. మొన్నటి దాకా దాదాపు 1100 మంది భారతీయులకు జెనీవాలోని హెచ్ ఎస్ బి సిలో రహస్య ఖాతాలున్నట్లు వార్తలొచ్చి సంచలనం సృష్టించాయి. ఇప్పుడు పనామా పత్రాల్లో  దాదాపు 500 మంది భారతీయుల పేర్లు ఉన్నట్లు వెల్లడైంది.

నల్ల ధనాన్ని దాచుకునేందుకు విదేశాల్లో బూటకపు కంపెనీలు, ఫౌండేషన్లు, ట్రస్టులు ఏర్పాటు చేసినట్లు ఈ పత్రాల ద్వారా తెలుస్తోంది. నల్లడబ్బుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే పనామాలోని మొసాక్ ఫొన్సెకాకు చెందిన కోటి 11 లక్షల పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 500 మంది భారతీయులున్నట్లు తెలుస్తోంది. నల్లడబ్బుకు నిలయాలైన చోట కంపెనీలు స్ధాపించి పన్న చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు ఈ కంపెనీలు తెరుస్తున్నట్లు వెల్లడైంది. 

ఇక ఇందులో ఉన్న భారతీయుల్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన కొడలు, అందాల తార ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కాక డిఎల్ ఎఫ్ ప్రయోటర్ కెపి సింగ్, ఇండియా బుల్స్ యజమాని సమీర్ గుప్తా, ప్రముఖ వ్యాపార వేత్త గౌతం అదానీ పెద్ద కుమారుడు వినోద్ అదానీ, పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు శిశిర్ బజోర్, ఢిల్లీ లోక్ సత్తా బీఫ్ అనురాగ్ క్రేజీవాల్ వంటి వారు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో దేశవ్యాప్తంగా పనామా పత్రాలపై చర్చ  జరుగుతోంది. నల్లధనం తీసుకువస్తామని, వారి పని పడతామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడేం చేస్తారో చూడాలి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -