Sunday, May 5, 2024
- Advertisement -

ఓటుకు నోటు కేసులో త్వ‌ర‌లో ఛార్జిషీటును కోర్టుకు స‌మ‌ర్పించ నున్నఏసీబీ అధికారులు

- Advertisement -
Jail to Chandrababu Naidu in vote note case scam..?

ఓటుకు … నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా …దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్తికి ఓటు వేయాలంటూ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీపెన్ స‌న్‌కు రూ.50 ల‌క్ష‌లు ఇస్తూ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డిని ఏసీబీ రెడ్‌హాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

ఆయ‌న స్నేహితులు ఉద్రుద‌య్‌సింహా,బిష‌ప్ హ్యారీ సెబాస్టియ‌న్‌ల‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం బేయిల్‌పై రేవంత్ రెడ్డి బ‌య‌ట ఉన్నారు. త్వ‌ర‌లోనే ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డితో పాటు మ‌రో న‌లుగురికి జైలు శిక్ష‌త‌ప్ప‌ద‌ని అధికారులు తేల్చిచెప్పారు.
సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసులో గ‌తంలో అరెస్ట్ అయిన ఐదుగురు నిందుతుల‌పై ఏసీబీ అధికారులు ప‌క్కాగా చార్జిసీటు రూపొందిచిన‌ట్లు స‌మాచారం.కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సంపాదించిన అధికారులు ..ప్ర‌ధాన నిందుతుడైన ఏపీ సీఎం చంద్ర‌బాబ నామినేటేడ్ ఎమ్మెల్యేఏ స్టీపెన్ స‌న్‌తో మాట్లాడిన అడియే టపుల‌ను కూడా ..ఫోరెన్స్‌క్ ల్యాబ్‌కు పంపి అ వాయిస్ బాబుదేన‌ని తేలిన‌ట్లు స‌మాచారం.

{loadmodule mod_custom,Side Ad 1}
ఓటుకు నోటు కేసులో అధారాల‌ను ప‌క్కాగా సేక‌రించిన అధికారులు త్వ‌ర‌లోనే కోర్టుకు స‌బ్‌మిట్ చేయ‌నునున్నారు. కోర్టుకు అంద‌గానే బాబును అరెస్ట్ చేయ‌మ‌ని అదేశాలు జారీచేస్తుందేమోన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. ప‌క్క రాష్ట్రంలో అదాయానికి మించిన ఆస్తుల‌కేసులో జ‌య‌ల‌లిత‌మీద కేసు నిరూప‌న అయిన విష‌యం తెలిసిందే. మ‌రో వైపు బీహార్ మాజీ ముఖ్య‌మ‌త్రి లాల‌నుకూడా ప‌శువుల దాణా కేసులో అరెస్ట్ చేయ‌డ‌మే కాకుండా విచార‌న‌ను ఎదుర్కోవాల‌ని ఈమధ్య‌నే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. త్వ‌ర‌లోనే బాబునుకూడా అరెస్ట్ చేసె అవ‌కాశాలు ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}OexZYNdkeZs{/youtube}

Also Read

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -