Saturday, May 4, 2024
- Advertisement -

ఆనందయ్య మందుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -

ఆనందయ్య నాటు మందు గురించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన విషయాలు వెల్లడించారు. కేఏ పాల్ కృష్ణపట్నం ఆనందయ్యకు మద్దతుగా నిలిచారు. ఆనందయ్య గురించి కేఏ పాల్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. తన తల్లిని ప్రైవేటు ఆస్పత్రే చంపేసిందని సంచలన విషయాలు చెప్పారు. తన తల్లి ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందన్నారు. అందరినీ అనలేమని.. కానీ కొంతమంది దోచుకుతింటున్నారన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రతతో బాధపడుతున్న ఎంతో మంది నిర్భాగ్యులు ఆస్తులు అమ్ముకొని మరీ చికిత్స కోసం ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా ఉధృతికారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చారన్నారు. ప్రకృతి సహజంగా లభించిన మూలికలతో మందులను తయారు చేస్తున్న ఆనందయ్యను కాపాడుకోవాలన్నారు. మన దేశంలో అనాధిగా వస్తునన వనమూలికలు, ఆకు పసరు మందుల గురించి తెలిసి కూడా కొంత మంది కార్పోరేట్ సంస్థలు అడ్డు పడుతున్నాయని ఆరోపించారు. ఆయన ఉన్న చోటికి జాతీయ మీడియా వెళ్లి విచారణ జరపాలని కోరారు. సైడ్ ఎఫెక్ట్స్ లేవని సంస్థలే చెబుతున్నాయి.

ఆనందయ్యను విడుదల చేయాలని సీఎం జగన్, డీజీపీ, కేంద్ర హోంమంత్రి, హైకోర్టు సీజేఐ, సుప్రీం సీజేఐలను కోరండని సూచించారు. సరైన మందు లేని కరోనాపై పోరుకు ఆనందయ్య తమతో చేతులు కలపాలని కోరారు. ఆనందయ్యను కస్టడీ నుంచి విడుదలచేయాలన్నారు. ఆనందయ్యతో కలిసి తమ సంస్థ ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. మందు తయారీకి కావలసిన మెటీరియల్స్ తెచ్చుకుంటే.. మందు తయారు చేసుకుని వెళ్లొచ్చన్నారు. కావలసిన ఏర్పాట్లు చేస్తామని, ఉచితంగా శిక్షణ అందిస్తామని కేఏ పాల్ అన్నారు.

నిమ్స్‌ (NIMS) లో వ్యాక్సిన్ తీగ లాగితే కదలుతున్న డొంకలు

బాలీవుడ్ లో విషాదం.. కరోనాతో నిర్మాత కన్నుమూత!

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ కొత్త చిత్రం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -