Sunday, May 5, 2024
- Advertisement -

అజ్ణాతంలోకి టీడీపీ నేత‌లు…

- Advertisement -

తెలంగాణాలో ఐటీ దాడులు చేసిన అధికారులు ఏపీనీ టార్గెట్‌గా చేసుకొని దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విచార‌ణ పూర్త‌యిన వెంట‌నే అధికార‌లు దాడులు చేయ‌డంసంచ‌ల‌నంగా మారింది. అధికార‌పార్టీ నేత‌ల‌నే టార్గెట్ చేసుకోవ‌డంతో నేత‌ల గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి.

ప్ర‌ధానంగా నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ప్రముఖ పారిశ్రామిక వేత్త బీద మస్తాన్‌రావు ఫ్యాక్టరీలు, నివాసాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించారు. చెన్నైలోని మస్తాన్‌రావు నివాసం, కార్పోరేట్ కార్యాలయం, నెల్లూరులోని కార్యాలయం, కావలి సమీపంలోని విమానాశ్రయ భూముల వద్ద రోయ్యల మేత ఫ్యాక్టరీ, రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేసే ప్రాసెసింగ్ యూనిట్‌పై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

దాడుల నేప‌థ్యంలో బీదా మస్తాన్ రావు, ఆయన సోదరుడు రవిచంద్రలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. వీరిరువురి కంపెనీలపైనా నిన్న ఐటీ మొదలైన ఐటీ దాడులు, నేడు కూడా సాగుతుండగా, ఎవరికీ అందుబాటులోకి లేకుండా అజ్ణాతంలోకి వెల్లిన‌ట్లు తెలుస్తోంది.

తమ సెల్ ఫోన్లను కూడా స్విచ్చాఫ్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కొందరు తెలుగుదేశం పార్టీ పెద్దలకు బీదా మస్తాన్ రావు బినామీగా వ్యవహరిస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. దామవరం, ఇసుకపల్లిలోని బీఎంఆర్ (బీదా మస్తాన్ రావు) కంపెనీల్లో నేడు ఉదయం కూడా సోదాలు జరుపుతున్న అధికారులు, అక్కడి కంప్యూటర్లను, కార్యాలయ అధికారుల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.

మరీ ఎక్కువగా ఆశిస్తున్నట్టుగా ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేధన కూడా అదేనేమో. అధికారం తప్ప ఇంకేమీ అవసరం లేదు………ఎవరు ఏమైనా పోయినా పర్లేదు అనే నాయకుడు పాలకుడిగా ఉంటే ప్రజల మనోభావాలకు విలువ ఎక్కడ ఉంటుంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -