Saturday, May 4, 2024
- Advertisement -

కేర‌ళ‌లో హెల్మెట్ లేద‌ని సైకిలిస్ట్‌కు భారీ షాక్ ఇచ్చిన పోలీస్‌లు…

- Advertisement -

సాధారణంగా టూవీలర్స్ వాడినవాళ్లకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ… దాదాపు దేశవ్యాప్తంగా పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుతున్నవారికి ఫైన్ వేస్తుంటారు. కాని కేర‌ళ‌లో హెల్మెట్ లేద‌ని సైకిలిస్ట్ భారీ షాక్ ఇచ్చాడు స‌ద‌రు పోలీస్‌లు. సైకిలిస్టులకూ వర్తిస్తుంటూ ఓ వ్యక్తికి ఏకంగా రూ.2 వేల జరిమానా విధించారు కేరళ పోలీసులు.అంతమొత్తం తన దగ్గర లేదని ఆ అభాగ్యుడు మొరపెట్టుకోవడంతో కనికరించిన పోలీసులు చివరికి రూ.500 కట్టించుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాసిం కేరళలో వలస కూలీ. కంబాలాలో ప్రధాన రహదారిపై సైకిలుపై వెళ్తుండగా అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదంటూ జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా వేగంగా వెళ్లడం నేరమంటూ రూ.2 వేల జరిమానా విధించారు. అక్కడితో ఆగక సైకిలు టైర్లలోని గాలిని తొలగించారు.

Kerala Police 1538826848 725x725.jpg

త‌న ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేద‌ని మెరపెట్టుకున్న కనికరించకపోవడంతో చివరికి రూ.500 కట్టించుకున్నారు. అయితే ఖాసీంకు పోలీసులు ఇచ్చిన చలానా రసీదుపై ఓ మహిళకు చెందిన స్కూటరు వివరాలు ఉండడంతో షాక్ అయిన ఖాసిం తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ద్వారా పంచుకున్నాడు. దీంతో ఈ న్యూస్ వైరల్ అయి ఎస్పీ దృష్టికి చేరింది. దీంతో తీవ్రంగా పరిగణించిన ఆయన ఘటనపై విచారణకు ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -