Sunday, May 5, 2024
- Advertisement -

త్వరలో హిమాలయాల్లో భారీ భూకంపం.. ఉత్తర భారతానికి తీవ్ర నష్టం: భూకంప కేంద్రం డైరెక్టర్ హెచ్చరిక

- Advertisement -

కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త కొత్త ఆశలు.. ఆలోచనలతో తెగ ఊహించేసుకుంటాం. పాత సంవత్స‌రానికి వీడ్కోలు ప‌లికి…కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లుకుతారు. కాని ఇచ్చే సంవ‌త్స‌రం 2018 మాత్రం అలాంటి ఆశ‌లు ఎక్కువ పెట్టుకోవ‌ద్దంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.

తాజాగా భార‌త్ లోని హిమాల‌యా ప‌ర్వ‌తాల్లో త్వ‌ర‌లో భారీ భూకంపం సంభ‌వించే అవ‌కాశాలు ఉంద‌ని భారత జాతీయ భూకంప అధ్యయన కేంద్రం డైరెక్టర్ వినీత్ గెహ్లాట్ తెలిపారు. రిక్ట‌ర్ స్కేలుపై ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని గర్వాల్‌ హిమాలయాల కేంద్రంగా ఈ భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అన్నారు. ఈ భూకంప తీవ్రతకు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలకు తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరించారు.

గత 700 ఏళ్లలో ఉత్తరాఖండ్‌ లో భూకంపం సంభవించిన దాఖలాలు లేవన్న ఆయన, అతి త్వరలోనే ఈ భారీ భూకంపం ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేయనుందని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాఖండ్ లో లభించిన వివరాల ప్రకారం చేసిన అధ్యయనంలో ఇది తేలిందని ఆయన చెప్పారు.

అంతేకాదు గత 100 ఏళ్లుగా భారీ భూకంపం సంభవించడానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ నిక్షిప్తమై ఉన్నాయని తెలియజేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించే భవనాలు సరైన ప్రణాళికలను అనుసరించాలని సూచించారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే నష్టం తీవ్రత తగ్గించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలు భూకంపాలు జోన్‌-1 లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -