Friday, March 29, 2024
- Advertisement -

ఆరోగ్య సూత్రాలు నచ్చాయ్.. పెళ్లి చేసుకుందాం అంటూ 14 లక్షలకు టోపీ!

- Advertisement -

తనొక దంత వైద్యరాలినట్టు టిక్ టాక్ లో ఒక వ్యక్తిని పరిచయం చేసుకుంది. “మీరు చెప్పిన ఆరోగ్య సూత్రాలు నాకు నచ్చాయి” . అంటూ అతనితో మాటలు కలిపి స్నేహం చేసింది.. స్నేహం కాస్త ప్రేమగా మారినట్లు నటించి అతని పెళ్లి చేసుకుందామని నమ్మించి అతని దగ్గర నుంచి 14 లక్షలు వసూలు చేసి మోసం చేసింది. తను మోసపోయానని గ్రహించిన సదరు యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

పద్మారావునగర్‌లో ఉంటున్న అర్జున్‌ అనే యువకుడు ఆరోగ్య రక్షణ, చిట్కాల పై వీడియోలు తీసి టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ ద్వారా వీడియోలు పోస్ట్ చేసేవాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది ఏప్రిల్ ఓ యువతి వర్ణనా మల్లికార్జున్ అనే పేరుతో సదరు వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుంది. ఇంస్టాగ్రామ్ లో చాటింగులు వాట్సాప్ మెసేజ్ లు ఫోన్ కాల్స్ ద్వారాకొంతకాలంపాటు వీరిద్దరి మధ్య సంభాషణలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే నేరస్తులు తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని ప్రస్తుతం తన పిన్ని బాబాయ్ దగ్గర ఉంటున్నానని చెబుతూ, కేరళలోని ఎర్నాకుళం వైద్య కళాశాలలో దంతవైద్యం పూర్తి చేసి విజయవాడలో ఉంటున్నానని చెప్పింది.

ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం పెళ్లి చేసుకుందామని అతని నమ్మించింది. అర్జున్ పెళ్లికి అంగీకరించడంతో వర్ణన మోసాలకు తెరలేపింది. తమ్ముడు సునీత్ కి ల్యాప్ టాప్ కావాలనే తెలుపగా అర్జున్ అతనికి ల్యాప్ టాప్ కొని ఇచ్చారు. అదే విధంగా వర్ణన సెప్టెంబర్లో అతనికి ఫోన్ చేసి తన తమ్ముడు కరోనా బారిన పడ్డాడు అని తెలుపగా అతనికి మెరుగైన చికిత్స కోసం దాదాపు రూ.4.60 లక్షల రూపాయలను ఖర్చు చేశాడు. వర్ణన కోసం ఒక బంగారు హారాన్ని కానుకగా ఇచ్చారు.

ఇక నవంబర్ లో వీరి పెళ్లి పెట్టుకుందామని భావించడంతో పెళ్లి ఖర్చుల కోసం అర్జున్ ఆమెకు ఏకంగా ఎనిమిది లక్షల రూపాయల నగదు, బంగారు ఉంగరాన్ని ఆమెకు పంపించాడు. ఇక పెళ్ళికి కేవలం నాలుగు రోజులు సమయం మాత్రమే ఉందని ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. అదేవిధంగా సునీత్ కి ఫోన్ చేయగా అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో తను మోసపోయానని భావించిన అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -