ప్రేమించి పెళ్లి చేసుకుని అగ్ని సాక్షి గా జీవితాంతం భరిస్తాను, ప్రేమిస్తాను, ప్రాణ ప్రదంగా చూసుకుంటాను అని ఏడడుగులు నడిచి మరీ ప్రమాణం చేసిన ఆ భర్త భార్య ని దారుణంగా హత్య చేసాడు. అనంతపురం దగ్గరి రాయదుర్గం లో ఎ దారుణం ఇవాళ ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన చిట్టెమ్మ అనే యువతీ ఉరవకొండ లోని రాజా తో ఆరేళ్ళ క్రితం పెళ్లి చేసుకుంది. వారికి నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.
మొహరం సందర్భంగా కొడుకు, భర్త లతో కలిసి ఆమె కంచెన పల్లికి వెళ్ళింది. పెళ్ళైన రెండు సంవత్సరాల తరవాత నుంచే వారిద్దరి మధ్యనా చాలా గొడవలు జరుగుతూ వస్తున్నాయి అని చెబుతున్నారు స్థానికులు. ఇవాళ ఉదయం భార్య కొడుకు మీద గొడ్డలి తో దాడి చేసాడు భర్త.
ఆ కొడుకు తనకి పుట్టలేదు అని అతను తరచూ గొడవలు పడేవాడు అని ఆమె కి అక్రమ సంబంధం ఉంది అని వాదిస్తూ ఉంటాడు అని స్థానికులు చెబుతున్నారు. గొడ్డలి తో తల్లీ కొడుకులని తీవ్రంగా గాయ పరచగా ఆమె అక్కడే చనిపోయింది, బాబు ని ఆసుపత్రి లో జాయిన్ చేసారు.
