Tuesday, April 23, 2024
- Advertisement -

ఫైన్ తప్పించుకోవడానికి.. మాస్క్ బదులు ఏం చేశాడో తెలుసా?

- Advertisement -

తెలంగాణలో కొత్తగా  3,307 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ప్రజలకు ఎంత జాగ్రత్తలు చెబుతున్నా కొంత మంది నిర్లక్ష్యం వల్ల వైరస్ పెరుగుతూనే ఉంది. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,045కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,08,396 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య  1,788కిగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 27,861 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

మాస్క్‌ పెట్టుకోని వారికి పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి రూ.1000 నుంచి రూ.2000 వరకు ఫైన్లు విధిస్తూ ప్రజలకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. అంతే కాదు పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ మాస్క్ లేని వారిని పట్టుకుని కొరడా ఝళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండల కేంద్రంలో అధికారులు బుధవారం తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి మాస్క్‌ లేకుండా బయటకు వచ్చాడు.

అయితే అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలియగానే ఏం చేయాలో పాలుపోక పక్కనే ఉన్న కిరాణా షాపు వద్దకు వెళ్లి ఓ కవర్ తీసుకు వచ్చాడు. దాన్ని తన మాస్క్ గా మార్చుకొని పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. మరీ ఇంత అతిక తెలివి తేటలు మంచిది కాదని.. ఇలా చేస్తే కరోనా తగ్గదని అంటు విమర్శిస్తున్నారు.

హై కోర్టు కీలక ఆదేశాలు.. ఇదే మొదటి సారి..!

కొత్త లుక్కులో షర్మిల.. ఏమన్నారు తెలుసా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -