Friday, April 26, 2024
- Advertisement -

కొత్త లుక్కులో షర్మిల.. ఏమన్నారు తెలుసా..!

- Advertisement -

తెలంగాణలో ఉద్యోగదీక్ష చేపట్టారు వైఎస్‌ షర్మిల. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర ఆమె దీక్షకు దిగారు. సాయంత్రం 5 గంటల వరకు షర్మిల ఉద్యోగదీక్ష కొనసాగనుంది.  తెలంగాణ కోసం యువత త్యాగాలు చేశారని షర్మిల పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేసిన విద్యార్థులు, యువకులు… ప్రభుత్వ నోటిఫికేషన్‌ల కోసం వేచి చూసి వేసారి…. బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన ముందుండి పోరాడతామని ప్రకటించారు.

యువత చనిపోతున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. ఖాళీలు భర్తీ చేసేదాక కేసీఆర్‌ను వదలబోమని తెలిపారు. నిరుద్యోగులకు సంఘీభావంగా 3 రోజులు దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. 4వ రోజు నుంచి ప్రతి జిల్లాలో తమ కార్యకర్తలు దీక్షలు చేపడతారని వివరించారు. 40 లక్షల మంది యువత తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఇటీవల కేయూలో సునీల్ నాయక్, మహేందర్ యాదవ్ నల్లగొండకు చెందిన సంతోష్ కుమార్ ఉరి వేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా.. దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్ పరిస్థితి ఉందన్నారు. కాగా, ఈ రోజు మరో కాటన్ పోచంపల్లి చీరలో షర్మిల దీక్షలో కూర్చున్నారు. అటు, ఆమె ఆహార్యం కూడా శిబిరంలో స్పెషల్ అట్రాక్షన్  అయింది.ఇక తెలంగాణలో ప్రాచూర్యం పొందిన పోచంపల్లి చీరను ధరించడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 

తెలంగాణ మరో ఎన్నికలకు సిద్దం..

నేటి పంచాంగం, గురువారం (15-04-2021)

దేశంలో కరోనా డేంజర్ బెల్.. 2 లక్షల కొత్త కేసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -