Sunday, May 5, 2024
- Advertisement -

ఫ్యాన్స్ అలాంటి పదజాలం వాడి ఉండకూడదు… గెలుపే మ‌న రివేంజ్‌…

- Advertisement -

ప‌వ‌న్‌పై క‌త్తి మ‌హేష్ చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్నె రేపాయి. ప‌వ‌న్ అభిమానులు సోషియ‌ల్ మీడియాలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే వీటిపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌న‌కు ఇష్టం లేనివి, న‌చ్చిన‌వి జ‌రుగుతుంటాయి. దానిపై ఎలా రియాక్ట్ అవ్వాలో అవుతాం అన్నారు.

మ‌న రోడ్డుమీద వెల్తున్న‌ప్పుడు కుక్క‌ల‌ను మ‌నం కంట్రోల్ చేయ‌లేం. మ‌న‌కు ఇష్టంలేనివి వంద జ‌ర‌గుతుంటాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై నాగబాబు స్పందిస్తూ…. వాక్ స్వాతంత్రం ఉంది కాదా అని మనం మాట్లాడితే తప్పులేదు, అలా మాట్లాడేవాళ్లు ఎవరైనా సరే… వారి మాటల వల్ల వచ్చే రెసిస్టెన్స్‌‌కు కూడా సిద్ధంగా ఉండాలి అన్నారు.

సోషియ‌ల్ మీడియాలో ఫ్యాన్స్ అలాంటి పదజాలం వాడి ఉండకూడదు మా ఫ్యాన్స్ ఈ మధ్య ఒక చిన్న ఇష్యూలో రియాక్ట్ అయ్యార‌న్నారు. ఎవరైతే వారిని రెచ్చగొట్టారో, వారికి ఎంత స్వాతంత్రం ఉందో…. వీళ్లకు అంతే స్వాతంత్రం ఉంది. కాకపోతే కొందరు ఫ్యాన్స్ వాడిన పదజాలం బెటర్‌గా ఉండాల్సింది. అలాంటి పదజాలం వాడిఉండకూడదు అని నాగబాబు అభిప్రాయ పడ్డారు.

మెగా ఫ్యామిలీలో చిరంజీవిగారు, కళ్యాణ్ బాబు సాఫ్ట్ టార్గెట్స్ అయ్యారు. ఎవ్వడు ఏదైనా అనేయొచ్చు అనుకుంటున్నారు. ఎవడు పడితే వాడు నోటికొచ్చినట్లు మాట్లాడతారు. సాఫ్ట్ టార్గెట్స్ కాబట్టి ఏదైనా అంటే మేము ఊరుకుంటాం, ఏమీ అనం… కానీ ఫ్యామిలీని అభిమానించే అభిమానులు అలా ఉండరు కదా…. అని నాగబాబు వ్యాఖ్యానించారు.

ఫ్యాన్స్ రైట్ గా చేశార‌ని చెప్ప‌డంలేద‌న్నారు. వాళ్లలో కొంత మంది వాడిన పదజాలం తేడాగా ఉన్నా… వాళ్ల ఆవేశాన్ని మాత్రం అర్థం చేసుకోగలను. వాళ్లు ఎక్స్‌ప్రెస్ చేసిన బాషలో తప్పు ఉండొచ్చు. కానీ వాళ్ల పెయిన్లో తప్పులేదు. వాళ్లను రిక్వెస్ట్ చేసేది ఒకటే. భాషను కరెక్టుగా వాడండి. అందులో. మీకు వాక్ స్వాతంత్రం ఉంది….. అని మాత్రమే చెప్పగలను అని నాగబాబు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -