నారాయ‌ణ కొడుకు న‌డిపిన‌ కారు ప్ర‌త్యేక‌త‌లు…

Minister Narayana son’s Car features

ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నితీష్ నారాయ‌ణ కారు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌న పాల‌వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయంశంగా మారింది. గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అజహరుద్దీన్ వంటి ప్రముఖుల కుమారులు రోడ్డు ప్రమాదంలోనే మరణించడం, తాజాగా నారాయణ కుమారుడిని సైతం ప్రమాదమే బలి తీసుకోవడం చాలామందిని కలచివేసింది.

చిన్న వయసులో దారుణం జరిగిందని వేదన చెందుతున్నారు. చేతికి వచ్చిన కొడుకు.. ఊహించని రీతిలో మరణించటంపై నారాయణ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రమాద వార్త తెలియగానే చాలామంది ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లయితే.. ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరుగుతోందని, రాత్రిపూట పబ్స్, బార్లు అంటూ తిరుగుతున్నారని ఒకింత ఘాటుగానే స్పందించారు.హ‌రికృష్ణ స్పందిస్తూ అబాధ ఎలావుంటుందో నాకు తెలుస‌న‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

{loadmodule mod_custom,Side Ad 1}
గతంలో ప్రమాదం బారిన పడిన ప్రముఖుల పిల్లలు కూడా లగ్జరీ కార్లలో అతివేగంగా ప్రయాణించడం వల్లే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో నారాయణ కుమారుడు నిషిత్ ప్రయాణించిన కారు కూడా అత్యంత లగ్జరీ కారు అని తెలుస్తోంది.ఏయిర్ బ్యాగులు తురుచుకున్నా ప్రాణాలు పోవ‌డం చూస్తే అతివేగ‌మే ప్ర‌మాదానికి కారనంగా తెలుస్తోంది.మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ మోడల్ కారు.. కేవలం కేవలం 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం కలిగి ఉండటం గమనార్హం. విషిత్ న‌డిపిన కారు ఖరీదైన కారుగా పేరు ప్రఖ్యాతులతో పాటు.. భద్రతా పరంగా ఎలాంటి లోపం ఉండదని చెబుతుంటారు. ఇక.. తాజా ఉదంతంలో విషీత్ డ్రైవ్ చేసిన కారు బెంజ్ జి-63 మోడల్.
కారు మోడల్-మెర్సిడెస్ ఏఎంజీ జీ63 వేగం- గంటకు 230 కి.మీ, 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ధర – రెండున్నర కోట్ల రూపాయలు ఇంజిన్ ఎనర్జీ – 420 కిలోవాట్, హార్స్ పవర్ – 571.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read