Thursday, May 16, 2024
- Advertisement -

మోడీ అవినీతి చేశారు.. అందుకు సాక్షం నా దగ్గర ఉంది- రాహుల్ గాంధీ

- Advertisement -
Modi personally involved in corruption Says Rahul Gandhi

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మోడీ పై గడిచిన రెండున్నరేళ్ల పాలనపై.. కేంద్రంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ ఈ సారి మోడీ పైనే ఆరోపణలు చేసాడు. నరేంద్ర మోడీ కి సంబంధించి వ్యక్తిగత అవినీతి ఇన్‍ఫర్మేషన్ మొత్తం తన దగ్గర ఉందని… తనకు దగ్గర ఉన్న సమాచారం అంతా పక్కా అని.. వాటిని బయట పెట్టేందుకు తాను చాన్స్ కోసం ఎదురుచూస్తుంటే… మోడీ సర్కార్ తనను లోక్ సభలో మాట కూడా మాట్లడకూండా చేస్తుందని వ్యాఖ్యానించారు.

మోడీకి సంబంధించిన అవినీతి సమాచారం తన దగ్గర ఉండటంతో.. మోడీ అండ్ కో భయపడుతున్నారని.. అందుకే తనకు లోక్ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు చేయడం వల్ల ప్రజల ఉపాధిని ప్రధాని ధ్వంసం చేశారని.. ఇందుకు మోడీ ప్రజలకు క్షమాపణలు ఖచ్చితంగా చెప్పాలని రాహుల్ అన్నారు. గడిచిన కొద్ది రోజుల మాదిరే ఈ రోజు (బుధవారం) కూడా లోక్ సభ సమావేశాల సందర్భంగా విపక్షాలు ఆందోళనల్ని నిర్వహించాయి.

దీంతో.. సభా కార్యకలాపాలు జరగలేదు. తర్వాత గురువారంకు సభను వాయిదా వేశారు. నోట్లరద్దుపై చర్చకు తాము రెడీగా ఉన్నప్పటికి.. మోడీ సర్కార్ తమను అడ్డుకుంటున్నారని… చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని రాహుల్ మండిపడ్డారు. ఏది ఏమైనా.. మోడీపై ఈ రెంజ్ లో రాహుల్ ఆరోపణలు చేయటం ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు. మరి ఇంతకి రాహుల్ దగ్గర మోడీకి సంబంధించిన అవినీతి సమాచారం ఏం ఉందని.. అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మరింది.

మరి రాహుల్ చేసిన కామెంట్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -