‘మహాసముద్రం’ సిద్దార్థ ఫస్ట్ లుక్!

- Advertisement -

ఆర్ఎక్స్ 100′ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’.  ఆర్ ఎక్స్ 100 చిన్న సినిమాగా రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి.. యూత్ హృదయాలను పట్టేసింది. ఆ తర్వాత మహాసముద్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అజయ్ భూపతి. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్నది.

ఈ చిత్రంలో శర్వానంద్ తో పాటు సిద్దార్థ నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ రోజున సిద్ధార్థ్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఫస్టులుక్ ను వదిలారు. ఈ ఫస్ట్ లుక్ సాధారణ యువకుడిలా కనిపిస్తున్నాడు సిద్ధార్థ్. బాయ్స్ చిత్రం తర్వాత సిద్దార్థ నటించిన తమిళ చిత్రాలు తెలుగు లో డబ్ అయిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఈ హీరో తెలుగు ప్రేక్షకులకు మంచి సుపరిచితమే. చాలాకాలం తరువాత నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం నుంచి ఇటీవలే శర్వానంద్, అదితి రావు హైదరిల ఫస్ట్ లుక్స్ కూడా విడుదలయ్యాయి. కాగా ఈ చిత్రం ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘శ్రీకారం’ ఫ్లాప్ తో డీలాపడిపోయిన శర్వానంద్ ను కూడా ఈ సినిమానే గట్టెక్కించాలి.

లాలూ ప్రసాద్​ యాదవ్​ కు బెయిల్

ఆరోజు తో కరోనా పోతుంది.. ఆరోగ్య శాఖ వెల్లడి..!

వాట్సప్‌ వాడే వారి డేటా మొత్తం లీక్..?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -