Monday, May 13, 2024
- Advertisement -

పాకిస్తాన్ చేష్టలకు అజిత్ ధోవల్ గట్టి పంచ్

- Advertisement -

భారత్ పై అక్కసుతో పాకిస్తాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాకిస్తాన్ తాజాగా గురువారం 1976వ సంవత్సరం నుంచి కొనసాగుతున్న ‘సంఝౌత ఎక్స్ ప్రెస్ ’ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను పూర్తిగా తెంచేసినట్టు అయ్యింది.

1970లో సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్ రాజధాని ఢిల్లీ నుంచి లాహోర్ కు ‘సంఝౌత’ ఎక్స్ ప్రెస్ రైలును నడిపిస్తున్నారు. రెండు దేశాల్లోని బంధువులు రాకపోకలు సాగిస్తున్నారు. తాజాగా ఈ రైలును ఆపివేయించి పాకిస్తాన్ తన వక్రబుద్దిని బయటపట్టింది. ఇక జమ్మూకశ్మీర్ పై వెనక్కితగ్గేది లేదని స్పష్టం చేసింది. ఇక భారత రాయబారిని పాకిస్తాన్ బహిష్కరించింది. దేశం నుంచి వెళ్లిపోవాలని సూచించింది. పాకిస్తాన్ హైకమిషనర్ ను భారత్ కు పంపరాదని వెనక్కి వచ్చేయాలని సూచించింది.

వరుసగా భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న పాకిస్తాన్ కు దిమ్మదిరిగేలా సెటైర్లు పేల్చారు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్. పాకిస్తాన్ వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవడంపై ఆయన ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్ కు ట్వీట్ తో ఎండగట్టారు.

పాకిస్తాన్ భారత్ తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవడం భారత్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం అని ట్విట్టర్ లో అజిత్ ధోవల్ ఎద్దేవా చేశారు. అది ఎంతంటే విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రాం లో ఒక వాణిజ్య ప్రకటన చేయాలంటే ఎంత వసూలు చేస్తాడో అంత నష్టం.. ఇది చాలా బాధాకరం.. ఈ భారీ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో తెలియడం లేదంటూ పాకిస్తాన్ ను ఎద్దేవా చేసేలా అజిత్ ధోవల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక్క ట్వీట్ తో పాకిస్తాన్ గాలి తీసేశారు అజిత్ ధోవల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -