Saturday, May 11, 2024
- Advertisement -

60 అడుగుల‌లోతులో లాంచీ….మృత‌దేహాల‌న్నీ అందులోనే ఉన్న‌ట్లు స‌మాచారాం

- Advertisement -

గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. దేవీపట్నం మండలం మంటూరు దగ్గర 60 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు కనుగొన్నాయి. సుమారు 60 అడుగుల లోతులోని ఇసుకలో లాంచీ కూరుకుపోయినట్టు తెలుసుకున్నారు. గల్లంతైనవారి మృత‌దేహాలన్నీ పడవలోనే ఉన్నట్టు గుర్తించిన అధికారులు, వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

గల్లంతైనవారి మృత‌దేహాలన్నీ పడవలోనే ఉన్నట్టు గుర్తించిన అధికారులు, వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లాంచీ అద్దాలు పగులగొట్టి మృత‌దేహాలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక లాంచీని ఎలా బయటకు తీయాలనే విషయంపై అధికారులు సమాలోచనలు సాగిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కొండమొదలు మధ్య మంటూరు ఎగువ వద్ద ప్రయాణీకులతో వెళుతున్న లాంచీ ఈదురు గాలుల తాకిడితో నీట మునిగిన విషయం విదితమే. ప్రమాద సమయంలో లాంచీలో సుమారు 55మంది ఉండగా, వారిలో 15 మంది వరకు ఈదుకుంటూ తప్పించుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు లాంచీని బయటకు తీయడానికి భారీ క్రేన్‌ను కూడా ఘటనా స్థలానికి రప్పించారు. లాంచీని బయటకు తీయడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, ముందుగా మృత‌దేహాలను అందులో నుంచి తేవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఇండియన్ నేవీ సిబ్బంది నీటి లోపలికి వెళ్లి మృత‌దేహాలను బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం మరోమారు సమీక్ష నిర్వహించారు. రాత్రంతా అధికారులను సూచనలిచ్చిన సీఎం.. సహాయచర్యలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. ఈరోజు ఉదయం సీఎం సంఘటనా స్థలానికి వెళ్లనున్నారు.

ప్రమాదానికి గురైన లక్ష్మీ వెంకటేశ్వర బోట్‌ సర్వీస్‌కి అనుమతి ఉందా లేదా అనే విషయమై అధికారుల వద్ద స్పష్టత లేదు. జలవనరుల ఉన్నతాధికారులు తాము అన్ని బోట్లకు అనుమతులు రద్దు చేశామని స్థానిక అధికారులు ఏమైనా ఇచ్చారేమో తెలియదని అంటున్నారు. పోర్టు అధికారులు కూడా ఇదే తరహాలో చెబుతున్నారు. ప్రస్తుతం తామేమీ అనుమతులివ్వలేదని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -