Saturday, April 20, 2024
- Advertisement -

కేరళలో కొత్త వ్యాధి.. రక్తం తో జాగ్రత్త..!

- Advertisement -

కేరళ రాష్ట్రంలో ‘ప్లాస్మోడియం ఓవల్​'( Plasmodium Ovale ) అనే కొత్త రకం మలేరియాను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. ఈ వ్యాధి సుడాన్​ నుంచి వచ్చిన ఓ జవాను సోకినట్లు గుర్తించామని చెప్పారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

భారత్​లో కరోనా వైరస్​ తొలి కేసు కూడా కేరళలోనే వెలుగుచూసింది. త్రిస్సూర్​ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి వూహాన్​ నుంచి వచ్చిన క్రమంలో అతనికి వైరస్​ సోకినట్లు గుర్తించారు. అలాగే.. 2018లో కోజికోడ్​ జిల్లాలో నిఫా వైరస్​ వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో కొత్త రకం మలేరియాపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.

రాష్ట్రంలో కొత్త రకం మలేరియా ప్లాస్మోడియం ఓవల్​ను గుర్తించాం. కన్నూర్​ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవాను శరీరంలో ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. అతను సుడాన్​ నుంచి వచ్చాడు. సరైన సమయంలో చికిత్స అందించటం, నివారణ చర్యలు చేపట్టటం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోగలిగాం అని మంత్రి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -