Thursday, April 25, 2024
- Advertisement -

ఇక సామాన్యుని చెంతకు విమానయానం

- Advertisement -

భారతదేశంలో మధ్యతరగతి ప్రజల కలలు నెరవేరనున్నాయి. ఆకాశంలో వెళ్తున్న విమానాన్ని చూస్తూ అందులో ఉన్న వారు ఎంత గొప్పవారో అని అనుకేనే మధ్యతరగతి మానవులు ఇక మీదట తాము కూడా గొప్పవారమనే భావించవచ్చు. ఇదంతా ఎందుకంటారా. ఏం లేదు. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా విమానంలో గంట ప్రయాణించాలంటే కేవలం 2500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

అలాగే అరగంట ప్రయాణానికి 1200 రూపాయల ధర చెల్లించాలి. కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రవేశ పెట్టిన పౌర విమానయాన విధానానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీంతో సామాన్యుల చెంతకు విమానయానం వచ్చేసింది. ఈ విధానం ద్వారా విమానయాన సంస్ధలకు కూడా కొంత మేలు చేసేలా దీన్ని రూపొందించారు.

విమాన సర్వీసులు లేని చోట్ల సర్వీసులు ప్రారంభించాలనుకున్న ప్రయివేటు సంస్ధలకు కేంద్రం ప్రోత్సాహకాలు అందజేస్తుంది. విమానాయాన వివాదాలు, ఫిర్యాదులు, లావాదేవిల పరిష్కారానికి ఓ సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. వినియోగంలో లేని ఎయిర్ స్రిప్ట్ లను 50 కోట్ల రూపాయల వ్యయంతో తిరిగి ప్రారంభించేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ చర్యలు తీసుకుంటుంది. ప్రాంతీయ విమానయాన సంస్ధల నిబంధనలను సరళతరం చేసి వారికి వ్యాపార అనుకూల వాతావరణాన్ని కలిగించడం కూడా ఈ సరికొత్త విధానంలో ముఖ్యమైనది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -