Sunday, May 19, 2024
- Advertisement -

బీజేపీ – టీడీపీ విడిపోయారు

- Advertisement -

ఏపీలో – కేంద్రంలో మిత్రపక్షాలుగా ప్రభుత్వంలో ఉన్న తెదేపా-బీజేపీల మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. తమ అగ్రనేతలు కొందరు తెదేపాకు అమ్ముడుపోయి పార్టీని పణంగా పెడుతున్నారంటూ ఇప్పటివరకూ లోలోపల ఆరోపణలు గుప్పించిన బీజేప నేతలు – ఇప్పుడు రోడ్డెక్కారు. ఇలాగైతే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తమకు మొండి చేయి చూపిస్తారన్న అనుమానం వ్యక్తం చేసిన నేతల వద్ద – మీకు బలం ఉంటే మీరు సొంతగానే పోటీ చేయండని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది.

కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును ఆ జిల్లా పార్టీ నేతలు కలిశారు. గుంటూరు యార్డులో ఇద్దరికి డైరక్టర్ పదవులు ఇస్తామని చెప్పి తెదేపా నేతలు మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తెదేపా నాయకత్వంతో మాట్లాడాలని కోరారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా తమకు మొండిచేయి చూపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దానికి స్పందించిన హరిబాబు ఈ విషయంలో తానేమీ చేయలేనని మీకు స్థానికంగా బలం ఉంటే కార్పొరేషన్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయండని సూచించారు. అదేవిధంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి ‘మనం కూడా కేంద్రంలో టిడిపి వాళ్లకు పోస్టులు ఇవ్వడం లేదు కదా ’ అని అన్నారట.  

ఈ నేపథ్యంలో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపాతో కలసి కాకుండా – విడిగానే పోటీ చేయాలని ఎన్నికలు జరుగుతున్న జిల్లాల బీజపీ కార్యవర్గాలు నిర్ణయించినట్లు సమాచారం. విశాఖ – గుంటూరులో తమకు బలమైన యంత్రాంగం ఉందని కాకినాడలో కూడా అర డజనుకుపైగా స్థానాలు సాధించే శక్తి ఉందంటున్నారు. తిరుపతిలో సగం డివిజన్లలో బలమైన యంత్రాంగం ఉందని చెబుతున్నారు. ఏ విషయం గురించైనా నిర్మొహమాటంగా మాట్లాడాలంటే.. టాలీవుడ్ వరకూ పోసాని కృష్ణ మురళి తర్వాతే ఎవరైనా. అంత నిష్కర్షగా మాట్లాడేసే పోసాని.. పవన్ గురించి మాట దాటేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా కూడా పవన్ పాలిటిక్స్ గురించి కావడం మరీ ఆశ్చర్యకరం.రాజకీయాల విషయంలో మెగాస్టార్ చిరంజీవి చాలా నిజాయితీపరుడు అంటున్నాడు పోసాని. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసేందుకు తన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే టికెట్ ఇచ్చారన్న పోసాని.. చిరు ప్రజారాజ్యం పెడితే మళ్లీ వెంట నిలబడతానని చెప్పాడు. ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అడిగితే మాత్రం..   ‘నేను ఒకరి గురించి మాట్లాడాలంటే నిజాయితీపరుడైనా కావాలి.. లేదా చెడ్డవాడైనా కావాలి’ అంటూ అసలు సంగతి చెప్పకుండా తప్పించేసుకున్నాడు.ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై… సినీ రంగం నుంచి ఓపెన్ గా అనుమానాలను ఎవరూ వెలిబుచ్చలేదు. కానీ ఇప్పుడు పోసాని చేసిన కామెంట్స్ కు మతలబు ఏంటా అనే చర్చ కాస్త గట్టిగానే నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -