Monday, May 6, 2024
- Advertisement -

కోడెల ఆత్మహత్యపై సీబీఐ విచారణ.. హైకోర్టులో పిటీషన్

- Advertisement -

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య వ్యవహారం మలుపు తిరిగింది. ఆయన ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.

ఈనెల 16న హైదరాబద్ లోని తన నివాసంలో కోడెల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే..కోడెల ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తూ అనిల్ బూరగడ్డ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. దీనిపై సీబీఐ విచారణకు ఆయన డిమాండ్ చేయడం ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం కోడెల సూసైడ్ పై అనుమానాస్పద మృతిగానే బంజరాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 12మందిని విచారించారు. కోడెల కాల్ డేటా అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు విషయం తేలాలంటే సీబీఐ విచారణనే చేయాలని ఓ వ్యక్తి హైకోర్టుకెక్కడం ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం కోడెల ఆత్మహత్య ప్రభుత్వ హత్య అని.. కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని కోడెల కూతురు ఆరోపించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇంటిసభ్యులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు హైకోర్టులో పిటీషన్ దాఖలు కావడంతో కేసు మలుపు తిరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -