Monday, April 29, 2024
- Advertisement -

కోడెల కొడుకుకు చంద్రబాబు ద్రోహం

- Advertisement -

టీడీపీలో అంతర్ యుద్దం మొదలైనట్లుగానే కనిపిస్తుంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి పార్టీలో పదవులను కట్టబెట్టడం టీడీపీ శ్రేణులకు నచ్చడం లేదని తెలుస్తుంది. తాజాగా ఇదే విషయంపై తొలిసారి పెదవి విప్పారు కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమని కాదని.. నిన్న కాక మొన్న టీడీపీకిలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు ఎలా నియోజకవర్గ బాధ్యతలను ఇస్తారని పార్టీ అధినేతను కోడెల కొడుకు కోడెల శివరాం ప్రశ్నిస్తున్నారు. దీనిపై మాట్లాడానికి కూడా చంద్రబాబు తనకు సమయం ఇవ్వడం లేదని వాపోతున్నారాయన.

పార్టీ కష్టకాలంలో ఉన్న తమను ఇలా దూరం పెట్టడం సరైన పద్దతి కాదని కోడెల శివరాం చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తరువాత సొంత డబ్బులతో కార్యక్రమాలను నిర్వహించమని.. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చామని కోడేల శివరాం తెలిపారు. పార్టీ కోసం చివరి నిమిషం వరకు పోరాటం చేసిన కోడెల కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బొజ్జల..బాలయోగి..గాలి వంటి నేతలు మరణిస్తే వారి కుటుంబాలకు ఇచ్చిన గౌరవం తమకు ఎందుకు లేదని కోడెల శివరాం టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీశారు.

అయినప్పటికి కూడా పార్టీలో క్రమశిక్షణగానే పని చేశామని..అలాంటిది తమను గుర్తించకుండా.. నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తికి పార్టీ బాధ్యతలు ఇవ్వడంపై కోడేల శివరాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లి ఇంఛార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంపై ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడానికి వీల్లేదని పార్టీ నుంచి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే దీనిపై కోడెల శివరాం తాజాగా స్పందించారు.
తాను. తన కుటుంబ సభ్యులు చాలా రోజులుగా చంద్రబాబును కలిసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాని తమను కలవడానికి కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన వాపోయారు.

పార్టీ ఆవిర్భావం నుంచి పోరాటం చేసిన కోడెల కుటుంబం పై కుట్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని శివరాం అభిప్రాయం పడ్డారు.అయితే సత్తెనపల్లి ఇంఛార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్రకటించగానే కోడెల తనయుడు శివరాం అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ నిర్ణయం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా కార్యకర్తలు చెబుతున్నారు. మరి కోడేల శివరాం టీడీపీలో కనసాగుతారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -