- Advertisement -

రైతులు, దళితులు, గిరిజన వర్గాలకు ఈ బడ్జెట్ లాభదాయకం ప్ర‌ధాని మోదీ…

- Advertisement -

బడ్జెట్‌ 2018 దేశ ప్రగతికి దిశానిర్దేశం చేసేలా, ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని ప్రధాన మోదీ అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సామాన్యులు, వ్యాపారులకు ఈ బడ్జెట్‌ ఎంతో అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. రైతులు, దళితులు, గిరిజనులకు ఈ బడ్జెట్‌ ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు.

‘ఇది రైతు హిత బడ్జెట్. రైతులకు, సాధారణ పౌరులకు, వ్యాపారవేత్తలకు బడ్జెట్ అనుకూలంగా ఉంది. ఈ బడ్జెట్‌తో జీవిత విధానం మరింత సరళంగా మారుతుంది. అన్ని రంగాలపై బడ్జెట్‌ను కేంద్రీకరించాం. వ్యవసాయం నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు కేటాయింపులు జరిగాయి. రైతులు, దళితులు, గిరిజన వర్గాలు ఈ బడ్జెట్ నుంచి లాభం పొందుతారు. గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. కనీస మద్దతు ధర రైతులకు విశేషంగా ఉపయోగపడుతుంది’ అని ప్రధాని మోదీ అన్నారు.

అన్ని రంగాలపై బడ్జెట్‌ను కేంద్రీకరించి ప్రకటించామని నరేంద్ర మోదీ తెలిపారు. సహకార వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో వ్యవసాయ ఉత్పాదక సంఘాల సేవలు విస్తృతం అవుతాయని తెలిపారు. దేశంలో రేపటితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని చెప్పారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.14.34 లక్షల కోట్లు కేటాయించాం. పండ్లు, కూరగాయల రైతుల ప్రయోజనాల కోసం రూ.500 కోట్లతో ఆపరేషన్‌ గ్రీన్స్ పథకం ప్రారంభించాం. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా మత్స్య, పారి పరిశ్రమ రైతులకు స్వల్ప కాలిక రుణాలు ఇస్తాం’ అని మోదీ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -