Thursday, April 25, 2024
- Advertisement -

క్వశ్చన్ పేపర్ లీక్.. అంతా అక్కడ గందరగోళం..!

- Advertisement -

విద్యాబుద్ధులు నేర్పవలసిన అధ్యాపకులే పరీక్షా ప్రశ్న పత్రాన్ని లీకు చేసి ఘటన గుంటూరు జిల్లా బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల సెకండ్‌ షిఫ్ట్​ పాలిటెక్నిక్‌ కళాశాలలో చోటుచేసుకుంది. ఈనెల 6న నిర్వహించిన పాలిటెక్నిక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం మూడో సెమిస్టర్‌ ‘’బేసిక్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌’’ ప్రశ్నపత్రం అర్ధగంట ముందు లీకైంది.

పలువురు విద్యార్థులు తెలిపిన ప్రకారం.. పాలిటెక్నిక్‌ పరీక్షలు మార్చి 31న మొదలయ్యాయి. ఈ కళాశాలలో పరీక్షల విభాగం సహాయ సూపరింటెండెంట్​గా పనిచేస్తున్న అధ్యాపకుడు హనుమంతరావు ఈనెల 6న పరీక్షకు 30 నిమిషాల ముందు ప్రశ్నపత్రాన్ని ఫోన్‌లో వీడియో తీసి అక్కడే అధ్యాపకురాలిగా పనిచేస్తున్న తన భార్య రమాదేవికి వాట్సాప్‌ ద్వారా పంపారు. విద్యార్థుల నుంచి రూ. వేలలో నగదును తీసుకున్న రమాదేవి, వారి ఫోన్లకు ప్రశ్నపత్రం వీడియోను వాట్సాప్‌ చేశారు.

ఈ విషయాన్ని కొందరు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి విజయభాస్కర్‌కు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే సమగ్ర విచారణకు కమిటీని నియమించారు. ఆ కమిటీ గురువారం మధ్యాహ్నం బాపట్లకు వచ్చింది. విధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు అధ్యాపకురాలు రమాదేవిని కళాశాల యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.

పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ పరీక్షలకు అరగంట ముందుగా కోడ్ తో కూడిన ప్రశ్నపత్రం సాంకేతిక విద్యాశాఖ విడుదల చేస్తుంది. అయితే సంబంధిత అధ్యాపకులు పరీక్ష కేంద్రంలోకి వచ్చిన విద్యార్థులకు పరీక్ష సమయానికి కేవలం ఒక్క నిమిషం ముందు ప్రశ్న పత్రాలను ముంద్రించి ఇవ్వవలసి ఉంటుంది.

అబ్బా.. తిరుపతిలో వేడి పుట్టిస్తున్న బిజేపి..!

వ్యాక్సినేషన్ ముమ్మరం చేయండి: సీఎం జగన్

ఇక మీదట సముద్రంలోకి వెళ్ళకూడదు.. ఆదేశాలు జారీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -