Friday, April 19, 2024
- Advertisement -

వ్యాక్సినేషన్ ముమ్మరం చేయండి: సీఎం జగన్

- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజురోజుకూ కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతూ అధిక మొత్తంలో న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అప్ర‌మ‌త్త‌మైన ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లకు ఉపక్ర‌మించింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకున్నారు.

తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆధికారుల‌ను ఆదేశించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు,ప‌రిష‌త్ ఎన్నిక‌లు జ‌రిగాయి. దీంతో ఆ పార్టీ నేత‌లు వాటిపై దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే.తాజాగా ఆ హ‌డావిడి ముగియ‌డంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌రోనాపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.


గురువారం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన టీకా ఉత్స‌వ్‌లో భాగంగా ఈ నెల 11 నుంచి 14 వ‌ర‌కు రాష్ట్రంలో నిత్యం 6 ల‌క్ష‌ల మందికి టీకాలు ఇచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. టీకా ఉత్స‌వ్ జ‌రిగే నాలుగు రోజుల్లో 24 లక్షల మందికి వ్యాక్సిన్లు అందించాల‌ని తెలిపారు. వ్యాక్సిన్ కొరత రాకుండా ఎప్పటికప్పుడు టీకాలు, కరోనా పై పర్యవేక్షణ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు.

ప‌వ‌న్ ‘వ‌కీల్ సాబ్’ గురించి… ఆలియా భట్ ఏమందో తెలుసా?

లక్కిఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ !

నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’కి బ్రేకులేసిన కరోనా

79 వేల మంది చిన్నారులకు కరోనా

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ నెక్స్ట్ మూవీ ఆయ‌న‌తోనేనా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -