Tuesday, April 16, 2024
- Advertisement -

ఖమ్మంలో వైయస్ షర్మిళ సభకు అనుమతి!

- Advertisement -

రాష్ట్రంలో కొత్తపార్టీ పెడుతున్నన వైఎస్‌ షర్మిల ఈనెల 9న ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభకు సన్నాహాలు మొదలయ్యాయి.  ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు ఖమ్మంలో మకాం వేసి పెవిలియన్‌గ్రౌండ్‌లో నిర్వహించే సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మంలో షర్మిళ సభ కోసం జనం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని, లోటస్ పాండ్ లో ఆమె బయలుదేరడం మొదలు మార్గం మధ్యలో జరిగే కార్యక్రమాల గురించి రూట్ మ్యాప్ ఖరారైందని షర్మిళమ్మ అనుచరుడు పిట్టా రాంరెడ్డి వెల్లడించారు.

మండలాలు, నియోజకవర్గాలవారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమవుతూ భారీగా జనసమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు.  కాగా, 9న జరిగే బహిరంగసభలో షర్మిల తన పార్టీ పేరు, జెండా, ఎన్నికల గుర్తు, సిద్ధాంతాలను వెల్లడించనున్నారు. 

ఇదిలా ఉంటే కొవిడ్‌ నిబంధనలు అనుసరించి సభ నిర్వహించుకోవాలని స్పష్టం చేసిన పోలీసుయంత్రాంగం.. ఆరు వేల మందికే పరిమితం చేస్తూ అనుమతిచ్చింది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే జనం ఉండాలని, శానిటైజర్లు, మాస్కులు, భౌతికదూరం ఖచ్చితంగా పాటించాలని సూచించింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -