Tuesday, May 14, 2024
- Advertisement -

స్వల్పంగా తగ్గిన బంగారం.. వెండి ధరలు

- Advertisement -

దేశంలో ఈ సారి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పడంతో స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. వర్షాలు కురియడానికి.. స్టాక్ మార్కెట్ కు సంబంధం ఏమిటనుకుంటున్నారా.. ఉందిలెండి.. ఏం కాదు.. వర్షాలు కురిస్తే రైతులు బాగుపడతారు. దేశంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది.

ఈ లెక్కన స్టాక్ మార్కెట్ లో కూడా భారీ మార్పులు వస్తాయి. బుధవారం మధ్యాహ్నానికి సెన్సెక్స్ 455. 28 పాయింట్లు లాభపడి 25,600 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. నిష్టి కూడా 134.80 పాయింట్లు లాభపడి 7,843పాయింట్ల వద్ద నిలిచింది.

మరోవైపు బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 146 రూపాయలు తగ్గి 29,190 లు, వెంటి కిలో 38,050 రూపాయలు ఉంది. ఇక దేశంలో డాలర్ మారకం ధర 66.53 రూపాయలుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -