ఆపరేషన్ ఆకర్ష అనగానే తెలుగు నాట ఏపీ లో తెలుగు దేశం పార్టీ వైకాపా వారిని లాగుతున్న ప్రక్రియ గుర్తుకు వస్తుంది. ప్రతిపక్షం అనేది ఉండకూడదు అని ప్లాన్ చేస్తున్న టీడీపీ ఫిరాయింపులు అత్యధికంగా, ఎన్నడూ లేనంతగా ప్రోత్సహించి పార్టీలో జనాలని చేర్చుకుంటోంది.
ఆంధ్రా లో టీడీపీ ఫిరాయింపుల విషయం లో యాక్టివ్ గా ఉంటె తెలంగాణా లో అధికార పార్టీ తెరాస కూడా బాగానే రెచ్చిపోతోంది. తెలుగు దేశానికి ఒకరకంగా కెసిఆర్ చుక్కలు చూపిస్తున్నారు అని చెప్పచ్చు. కరిజ్మా ఉన్న నాయకులు ఇప్పుడు తెలుగుదేశంలో లేరు. ఉన్నవారిలో కాస్త హడావుడి చేసేది ఎవరయ్యా అంటే.. రేవంత్‌రెడ్డి అనుకోవచ్చు.
ఒకపక్క పార్టీ ఖాళీ అయిపోతుంటే ఆయన భరించలేకపోతున్నారో ఏమో… పార్టీలోకి కొత్తనీరు నింపేందుకు తనదైన శైలిలో కార్యాచరణకు ఆయన దిగుతున్నారు! తనస్టైల్లో ఆకర్ష్‌ను అమలు చేస్తున్నారు. తెరాస నుంచి దేశంలోకి వలసలు అనుకుంటున్నారేమో… భాజపా నుంచి దేశంలోకి! భాజాపా కి అనుబంధ సంస్థగా ఉన్న ప్రతీ విద్యార్ధి సంఘాన్నీ కొంతమంది యువత తెలుగు దేశం అనుబంధ సంస్థ లోకి ఆహ్వానించారు.
ఏబీవీపీ కి చెందిన కొందరు కుర్రరల్లని రీవంత్ తీఎన్ఎస్ ఎఫ్ లోకి చేర్చారు. ఆయనే దగ్గర ఉండి ఈ పని చేసారు. దీంతో బీజేపీ ఆయన మీద విపరీతమైన కోపంతో ఉంది.
Related
