Monday, April 29, 2024
- Advertisement -

మనవాడే అనుకుంటే.. మనకే దేబ్బెస్తున్న బ్రిటన్ ప్రధాని!

- Advertisement -

భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఇటీవల బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే రిషి సునాక్ ప్రధానిగా ఎన్నిక కావడంపై యూకే పీపుల్స్ ఎంతవరకు సంతోషంగా ఉన్నారో తెలియదు గాని, భారతీయులు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే 200 సవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారి దేశానికి భారత సంతతికి చెందిన రిషి ప్రధానిగా ఎన్నిక కావడంతో ప్రతి భారతీయుడు హర్షం వ్యక్తం చేశాడు. ఇక ఇరు దేశాల మద్య సత్సంబంధాలు మెరుగుపడడం ఖాయమని అందరూ భావించారు. అయితే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత రిషి సునాక్ ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా ఆదేశం లో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి, అలాగే ఆర్థిక సంక్షోభం, పలు రకాల టాక్స్ లపై ఎదురవుతున్న వ్యతిరేకత వీటన్నిటిపైన తనదైన మార్క్ చూపించవలసి ఉంటుంది. .

ఇప్పటికే కొన్ని వింప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టిన రిషి.. కొత్తగా తీసుకునే నిర్ణయాలతో భారత్ పై పెను ప్రభావం చూపనుంది. ముఖ్యంగా దేశంలో వలసలను తగ్గిచేందుకు కొత్త విధానాలను తీసుకురాబుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు సరికొత్త ప్రణాళికలు వేస్తున్నాడట రిషి సునాక్. ముఖ్యంగా విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధించిన, లేదా వలసదారుల నియంత్రణకు ప్రత్యక చట్టాలను తీసుకొచ్చిన.. భారత్ కే అధిక నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే విదేశీ విద్య నిమిత్తం మనదేశం నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు యూకే వెళుతున్నారు. అంతే కాకుండా బ్రిటన్ కు వలసవచ్చిన వారిలో భారతీయులే అధికం. దీంతో వలసదారులపై రిషి తీసుకునే నిర్ణయాలు భారతీయులకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. మరి భారత సంతతికి చెందిన వాడిగా భారతీయులను దృష్టిలో ఉంచుకొని ఏమైనా సవరణలు చేస్తారా లేదా బ్రిటన్ ప్రధాని హోదాలోనే రిషి సునాక్ తన నిర్ణయాలకు కట్టుబడి ఉంటారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

జగన్ ట్విస్ట్ లు, బాబు ప్లాన్లు.. హిట్ పెంచుతోన్న వ్యూహాలు!

త్రీ క్యాపిటల్స్ స్వలాభమా.. ప్రజా లాభమా!

బీజేపీ సినీ మంత్రం.. ఎందుకోమరి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -