Thursday, April 25, 2024
- Advertisement -

తిరుపతిలో విషాదం.. ఆక్సిజన్ అందక రుయాలో 11 మంది మృతి!

- Advertisement -

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో మరిన్ని కష్టాలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఆక్సీజన్ కొరతతో కరోనా రోగుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో 11 మంది కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దీనిపై కలెక్టర్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని వెల్లడించారు. ఐదు నిమిషాలు ఆక్సిజన్ అందకపోవడంతో చనిపోయారని, ఆసుపత్రిలో ఉన్న మరికొందరి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. అయితే, రోగుల బంధువులు మాత్రం 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా చాలా తక్కువ స్థాయిలో జరిగిందని ఆరోపిస్తున్నారు.

ఆ తరువాత ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించినా అప్పటికే నష్టం జరిగిపోయిందని తమ వారు చనిపోయారని రోదిస్తున్నారు. మరణాల సంఖ్య కూడా ఇంకా ఎక్కువే ఉంటుందని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. దాదాపు వెయ్యి మందికి చికిత్స జరుగుతోందన్నారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా వచ్చిందని, ఆక్సిజన్ ఆలస్యం కావడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. మృతదేహాలను ప్లాస్టిక్ కవర్ లో చుడుతున్నారు రుయా సిబ్బంది.

కడప పేలుళ్ల ఘటనలో వైసీపీ నేత నాగేశ్వరరెడ్డి అరెస్ట్!

నేటి పంచాంగం, మంగళవారం (11-05-2021)

ఎన్టీఆర్ కి కరోనా.. త్వరగా కోలుకోవాలి బ్రదర్ అంటూ మహేష్ ట్వీట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -