Tuesday, April 23, 2024
- Advertisement -

ఏపీ సీఎస్​గా సమీర్​ శర్మ?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమితులు కానున్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ .. త్వరలో ఏపీ సీఎస్​గా బాధ్యతలు చేపట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం రాలేదు కానీ .. ఈ మేరకు వార్తలు మాత్రం వస్తున్నాయి. ప్రస్తుతం రమేశ్​ వర్మ.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలం .. ఈ నెల 30న ముగియనున్నది.

అయితే ఆయన పదవీ కాలం ఇంకో మూడునెలలు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖ పై ఇంకా కేంద్రం ఏ నిర్ణయం ఎటువంటి తీసుకోలేదు. అయితే ఇంతలోనే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ రాష్ట్రానికి సీఎస్​గా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సీఎం జగన్​ మోహన్​ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట.ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఆదిత్యనాథ్​ దాస్​ పదవీ కాలాన్ని పొడిగిస్తే.. మూడునెలల పాటు రమేశ్​ వర్మను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమించి, ఆ తర్వాత సీఎస్​ను చేయబోతున్నట్టు సమాచారం.

గతంలో నీలం సాహ్ని ప్రభుత్వ కార్యదర్శి గా ఉండగా, ఆమె పదవీకాలం పూర్తి కావడంతో మరోసారి ఆమెను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించాలని ఏపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ సర్కార్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగించింది. అయితే ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది.

Also Read

తెలుగు ప్రజలంటే ఎంతో అభిమానం.. సేవ చేయాలనుకుంటున్నా : ఎంపీ, సినీనటి నవనీత్‌కౌర్‌

మరియమ్మ లాకప్‌డెత్‌పై సీఎం కేసీఆర్ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -