Thursday, April 18, 2024
- Advertisement -

ఆంధ్రాకు తిరిగి రానని ఎల్వీ శపథం

- Advertisement -

ముఖ్యమంత్రితో ఢీకొని తన పదవిని పోగొట్టుకున్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్రంలో తనకున్న పలుకుబడితో కేంద్ర సర్వీసులోనే చేరాలని.. ఇక మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు తిరిగిరాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఏపీలో పనిచేయనని ఆయన డిసైడ్ అయిపోయారట..

ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పదవి నుంచి ఇటీవలే తొలగించబడి ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఒక చిన్న ఉద్యోగానికి బదిలీ అయిపోయారు ఎల్వీ సుబ్రహ్మణ్యం. అయితే ఆయన బదిలీ అయినా ఆ స్థానంలో చేరలేదు. రిపోర్ట్ చేయలేదు. ఒక నెలరోజులు సెలవు పెట్టి వెళ్లిపోయారు. డిసెంబర్ 6లోగా ఆయన విధుల్లో చేరాల్సి ఉంది.

అయితే తాను ఏపీలో విధుల్లో చేరనని.. ఆంధ్రా కేడర్ కు తిరిగి అస్సలు రాలేనని సుబ్రహ్మణ్యం తన స్నేహితుల వద్ద వ్యాఖ్యనించినట్టు తెలిసింది. తన సెలవులను నిరవధికంగా పొడిగిస్తూనే ఉంటానని అన్నాడట..

ప్రస్తుతం మళ్లీ ఏపీలో తిరిగి చేరకుండా కేంద్రంలో డిప్యూటేషన్ పై ఏదైనా పోస్టులో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నాడట.. ఆయన ప్రయత్నాలు ఫలిస్తే ఢిల్లీలోనే తిరిగి చేరి అక్కడే ఆయన పదవీ విరమణ చేస్తాడు.

అయితే ఎల్వీ సుబ్రహ్మణ్యం పదవీకాలం మరో ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇంత తక్కువ పదవీకాలం ఉన్న ఎల్వీని కేంద్రం తీసుకొని ఏదైనా పోస్టులో అవకాశం కల్పించే పరిస్థితి అయితే కనపడడం లేదట. దీంతో అటు కేంద్రంలో పోస్టు దక్కక.. ఇటు ఏపీలో చేరకపోతే ఎల్వీకి ఇబ్బందులు తప్పవు.

వచ్చే ఐదునెలల్లో రిటైర్ కాబోతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం.. పదవీ విరణమకు కనీసం ఒక రోజు ముందు అతను జాబ్ లో చేరి సేవా చేయాల్సి ఉంటుంది. దీంతో కేంద్రం అవకాశం ఇస్తుందా? తిరిగి ఏపీకి వస్తాడా అన్నది ఆసక్తిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -