Friday, May 3, 2024
- Advertisement -

మరియమ్మ లాకప్‌డెత్‌పై సీఎం కేసీఆర్ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

- Advertisement -

మరియమ్మ లాకప్‌డెత్ కేసు సంచనలం సృష్టించింది.. ఇప్పటికే ఈ కేసులో.. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌. కానీ మరియమ్మను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని.. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని దళిత సంఘాలు.. పరలు రాజకీయ పార్టీలు పోరాటం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీనిచ్చారు. లాకప్ డెత్‌కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. అంతే కాదు మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం తెలిపారు.

కుమారుడు ఉదయ్ కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో రూ.10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ఇక లాకప్ డెత్ కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదని సూచించారు. అవసరమైతే ఉద్యోగంలోంచి తొలగించాలని ఈ సందర్భంగా డీజీపీని మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ షురూ…!

బండ్ల గణేష్ స్పీచ్ మరోసారి వైరల్..!

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల బరువు పెరుగుతారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -