Sunday, May 12, 2024
- Advertisement -

ఛీ ఛీ ఇంతకన్నా దారుణం ఇంకా ఏమైనా ఉంటుందా ?

- Advertisement -

మాయమైపోతున్నడమ్మా….మనిషన్నవాడు, మానవత్వమైనా లేదు…అంటూ ఓ కవి ఆర్ధ్రతతో పాట రాసుకున్నాడు. ఆయన పాట అక్షరాలా నిజం. సెల్ఫీ మోజులో ప్రాణాలు తీసుకోవడమే కాదు. తోటి వ్యక్తుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని స్థితిలోకి వెళ్లిపోతున్నారు కొందరు. దివంగత సినీనటుడు, సీనియర్ టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ చావుబతుకుల్లో ఉంటే కొందరు సెల్ఫీలు తీసుకుని ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలను తమ వారందరికీ షేర్ చేసుకున్నారు. ఇంతకంటే దారుణం, అమానవీయం ఇంకొకటి ఏమైనా ఉంటుందా ? సెల్ఫీ పిచ్చోళ్లంతా సిగ్గుపడే సంఘటన కాదూ ఇది ? నల్గొండ జిల్లా హైవేలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నందమూరి హరికృష్ణను స్థానికులు, ఆయనతో పాటు కారులో ప్రయాణించివారు కలసి నార్కేట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు బలగం ఢీకొనడంతో హరికృష్ణ తలకు, ముకానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తం బాగా పోయింది. దీంతో స్పృహ కోల్పోయిన ఆయనను క్షణాల్లో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వచ్చి చికిత్స అందించారు. ఆయనను ఎలాగైనా బతికించుకోవాలని శతవిధాలా ప్రయత్నించారు. కానీ అప్పటికే బాగా రక్తం పోవడంతో ఆయన పరిస్థితి విషమించింది. కామినేని హాస్పిటల్ వైద్యులు సర్వశక్తులూ ఒడ్డి తీవ్రంగా శ్రమించినా విషాదం తప్పలేదు. తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడిన హరికృష్ణ చివరకి తుదిశ్వాస విడిచారు. నందమూరి అభిమానులతో పాటు సినీ రాజకీయ వర్గాల్లో పెను విషాదాన్ని నింపారు.

అయితే ఆలస్యంగా వెలుగు చూసిన ఓ సెల్ఫీ ఇప్పుడు తీవ్ర విమర్శల పాలయ్యింది. గాయాలతో ఉన్న హరికృష్ణకు వైద్యులు చికిత్స చేయడానికి ముందు, ఆ హాస్పిటల్ కు చెందిన నలుగురు సిబ్బంది అతడి వద్దకు చేరి సెల్ఫీలు దిగారు. చావుబతుకుల మధ్య ఆయన ఉంటే వీరు సెల్ఫీలు దిగి స్నేహితులతో షేర్ చేసుకున్నారు. కనీసం ఆలోచన కూడా లేకుండా అలా చేయడం తీవ్ర విమర్శల పాల్జేసింది. హరికృష్ణ సెలబ్రిటీ అయినా కాకపోయినా, ముందు మనలాంటి తోటి మనిషి. ఆయన చావుబతుకుల మధ్య పోరాడుతుంటే, వైద్యులు వచ్చేలోపు చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు ఓ వైపు చేస్తూనే, మరోవైపు ఇలా సెల్ఫీలు దిగి మీరు పొందే ఆనందం ఏంటి ? అని ఆ సిబ్బిందిని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. కనీసం కామన్ సెన్స్ అయినా ఉందా ? తోటి మనిషి ప్రాణాలతో గిలగిలా కొట్టుకుంటుంటే మీకు సెల్ఫీలు కావాల్సి వచ్చాయా ? అని జనం చీవాట్లు పెడుతున్నారు. అయితే విషయం సోషల్ మీడియా ద్వారా హాస్పిటల్ యాజమాన్యం సహా అందరికి తెలియడంతో ఆ నలుగురు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వెల్లువెత్తింది. దీనిపై స్పందించిన కామినేని హాస్పిటల్ యాజమాన్యం ఆ నలుగురు సిబ్బందిపై వేటు వేసింది. విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ సెల్ఫీ దిగింది చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు కాదని, ప్రాణాలు కోల్పోయాక అని మరో వైపు కొందరు చెప్పుకొస్తున్నారు. అప్పుడయినా తప్పే కదా. ఆయన కుటుంబీకులు, అభిమానులు బాధ పడుతుంటే సెల్ఫీ తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. మొత్తానికి యాజమాన్యం వేటు వేయడంతో వీళ్లను చూసైనా మిగిలిన సెల్ఫీ పిచ్చోళ్లు ఇలాంటి పనులు చేయకుండా ఉంటే చాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -