- Advertisement -

సాయంత్రానికి కోలుకుంటాయని ఆశ

- Advertisement -

సోమవారం నాడు భారీ లాభాలతో మంచి ఊపుమీదున్న స్టాక్ మార్కెట్ మంగళవారం నాడు డీలా పడింది. బీఎస్ఈ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 22.85 పాయింట్ల నష్టంతో, 25,666.01 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 13.40 పాయింట్లు పడిపోతూ 7,852.65 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక హిందుస్ధాన్ యూనిలీవర్ లిమిటెడ్ నాలుగో త్రైమాసికంలో నికర లాభాలు పెరిగాయి. దీంతో ఆ కంపెనీ షేర్లు ఒక శాతం పెరిగాయి. అదానీ పోర్ట్స్, రెడ్డీ ల్యాబ్స్, టాటా స్టీల్ మారుతీ, యాక్సిస్ బ్యాంకులు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్ టెల్,  ఎన్టీపిసి, ఒఎన్ జీసి కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బంగారం, వెండి ధరలు కూడా నష్టాల్లోనే ఉండడం గమనార్హం. ఇ డాలర్ తో రూపాయి మారకం విలువ 66.7 గా ఉంది. మంగళవారం ఉదయం నుంచి మధ్యహ్నం వరకూ నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి లాభ పడు అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు ఆశిస్తున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -