- Advertisement -

ఏపీ, తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో హైఅల‌ర్ట్ …

- Advertisement -

శ్రీలంకలో వరుస పేలుళ్లతో మారణం హోమం సృష్టించిన ఉగ్రమూకలు భార‌త్‌లో కూడా న‌ర‌మేధం సృష్టించేందుకు పూనుకున్నార‌ని కేంద్ర ఐబీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.ఉగ్రమూకలు సముద్ర మార్గం గుండా భారత్‌లోకి ప్రవేశించారని కేంద్ర నిఘా సంస్థలు వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. మొత్తం 19 మంది ఉగ్రవాదులు సముద్రమార్గంలో ప్రయాణించి తమిళనాడు రాష్ట్రం రామనాథ్‌పురం వద్ద భారత్‌ భూభాగంలోకి ప్రవేశించినట్టు ఐబీ వెల్లడించింది.

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో 19 చోట్ల దాడులకు వ్యూహరచన చేసినట్టు ఐబీ హెచ్చరించింది. దీంతో కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

ఉగ్రవాదులు ఈ సిర రైళ్లను టార్గెట్ చేసె అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం. జన సమ్మర్ధం గల ప్రాంతాలు, ప్రార్థన మందిరాలు, ఆలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల డీజీపీలను ఐబీ అప్రమత్తం చేసింది.కర్ణాటక రాజధాని బెంగళూరు, ప్రముఖ పర్యాటక ప్రాంతం మైసూరు నగరాలే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యమని ఓ లారీ డ్రైవర్‌ సమాచారం అందించినట్టు కర్ణాటక డీజీపీ దక్షిణాది రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు.

ఐబీ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరిలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, రద్దీ ప్రదేశాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, మార్కెట్లు, మాల్స్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు బెంగళూరు సీపీ సునీల్ కుమార్ తెలిపారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -