Sunday, May 12, 2024
- Advertisement -

స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్రహాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ..

- Advertisement -

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్మారకార్థం గుజరాత్ నర్మదా నది ఒడ్డున నిర్మించిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. పటేల్‌ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. నర్మదా జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో ఉన్న సాధు బెట్‌లో ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ నిర్మించారు. 2013 అక్టోబర్‌ 31 న ప్రధాని మోదీ ఐక్యతా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగ‌తి తెలిసిందే.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా దీనికి గుర్తింపు వచ్చింది. 33 నెలల్లో ఈ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్ర‌పంచంలోనే అతి ఎత్తైన విగ్ర‌హం. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్‌ డ్యామ్‌ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -