గుర్తింపు కోసం ఆత్మహుతి దాడి.. అందరూ గుర్తుపెట్టుకుంటారు..!

- Advertisement -

“ప్రపంచం నన్ను ఎప్పటికీ మర్చిపోదు”… అమెరికాలోని నాష్​విల్​లో ఇటీవల ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఆంటోనీ క్విన్ వార్నర్​ ఘటనకు కొద్ది రోజుల ముందు చేసిన వ్యాఖ్యలివి. ఈ విషయాన్ని అతడి పొరుగు ఇంటి వ్యక్తి రిక్​ లౌడ్ వెల్లడించారు.

అమెరికాలోని టెనెస్సీ రాష్ట్ర రాజధాని అయిన నాష్​విల్​లో క్రిస్మస్​ రోజు బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా పదుల సంఖ్యలో భవనాలకు ఆస్తి నష్టం సంభవించింది. నిందితుడు మృతిచెందాడు. అయితే ఈ దాడికి కారణాలేంటో ఇప్పటికీ తెలియలేదు.

- Advertisement -

డిసెంబరు 21న వార్నర్​ అతని ఇంటి పోస్ట్​ బాక్స్ వద్ద ఉండగా నేను వెళ్లి పలకరించాను. అతని తల్లి క్షేమసమాచారాలు తెలుసుకున్నాక ఈ క్రిస్మస్​కు నీకు శాంటా ఏమైనా మంచి చేస్తాడా అని అడిగాను. హా అవును.. నాష్​విల్, ప్రపంచం నన్ను ఎప్పటికీ మర్చిపోలేదు అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. వార్నర్​పై నాకు ఎప్పుడూ అనుమానం రాలేదు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -